సీఎం కేసీఆర్‌తోనే కుల వృత్తులకు ప్రాణం


Sat,September 14, 2019 03:30 AM

-బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
-పోచమ్మ చెరువులో చేప పిల్లల విడుదల

మందమర్రి రూరల్ : సింగరేణి ఇచ్చే పరిహారాన్ని సైతం త్యాగం చేసి తల్లిదండ్రులు ఇస్తున్న కారుణ్య ఉద్యోగాలను కాపాడుకోవాలనీ, బాధ్యతగా పనిచేయాలని కొత్త ఉద్యోగులకు మందమర్రి జీఎం రమేశ్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన స్థానిక సీఈఆర్ క్లబ్‌లో నిర్వహించిన కారుణ్య ఉద్యోగ పత్రాల అందజేత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సింగరేణిలో ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి లాంటి ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం పొందడం అదృష్టంగా భావించాలని చెప్పారు. గైర్హాజరు కాకుండా బాధ్యతగా పనిచేసి, సంస్థకు, కుటుంబానికి అండగా నిలవాలన్నారు. గొప్ప చదువులు చదివి బయట కంపెనీలో ఉద్యోగాలు చేసిన కేవలం నెలకు రూ.10 నుంచి రూ. 20వేల సంపాదనే ఉంటుందన్నారు. సింగరేణిలోని బదిలీ ఫిల్లర్‌కు నెలకు రూ. 40వేల వేతనం పొందవచ్చని తెలిపారు.

డిగ్రీ విద్యార్హతలున్న వారికి ఇక్కడ విలువనిస్తామని తెలిపారు. బదిలీ వర్కర్‌గా చేరిన ఉద్యోగికి అర్హతను బట్టి జనరల్ మేనేజర్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు ఎం. సంపత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతోనే సింగరేణిలో ఉద్యోగాలు అమలవుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకూ 5500 మంది ఉద్యోగాలు పొందారని చెప్పారు. ఉద్యోగాలు దొరక యువత చాలా ఇబ్బంది పడుతున్నారనీ, కొన్ని సంస్థల్లో ఉద్యోగ భద్రత లేదన్నారు. తల్లిదండ్రులను మరువకుండా ఉద్యోగాలు కాపాడుకొని, ఉన్నతంగా స్థిరపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి పీఎం శ్యామ్ సుందర్, ఏరియా అధికారుల సంఘం అధ్యక్షుడు జక్కరెడ్డి, ఏఐటీయూసీ నాయకుడు అక్బర్ ఆలీ, సంక్షేమ అధికారి బోసు, అన్ని గనుల మేనజర్లు, సంక్షేమ అధికారులు కార్మిక నాయకులున్నారు.

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...