సీఎం కేసీఆర్‌తోనే కులవృత్తులకు ప్రాణం


Sat,September 14, 2019 03:25 AM

బెల్లంపల్లి, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ వల్లే తెలంగాణలో మళ్లీ కులవృత్తు లు ప్రాణం పోసుకున్నాయని బెల్లంపల్లి ఎమ్మె ల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. బెల్లంపల్లి పోచమ్మచెరువులో శుక్రవారం 30వేల చేపపిల్లలను వదిలారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గంగపుత్రులు, ముదిరాజ్‌ల అభ్యు న్నతికి చ ర్యలు పాటుపడుతున్నారని పేర్కొన్నారు మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి చెరువులు, కుంట ల్లో లక్షల చేప పిల్లల పెంపకానికి శ్రీకారం చుట్టా రని తెలిపారు. నియోజకవర్గంలో 80వేల చేప పిల్లలను చెరువుల్లో వదలడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. జడ్పీ వైస్‌చైర్మన్ సత్యనారాయ ణ, ఎంపీపీ గొమాస శ్రీనివాస్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, మత్స్యశాఖ అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

21
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...