గులాబీ జెండా ఎగురవేస్తాం


Sat,September 14, 2019 03:25 AM

బెల్లంపల్లి, నమస్తే తెలంగాణ : రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోని అన్నిమున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేస్తామని బెల్లంపల్లి ఎమ్మె ల్యే దుర్గం చిన్నయ్య, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి అరిగెల నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. బెల్లంపల్లి పద్మశాలీ భవనంలో శుక్రవారం జరిగిన టీఆర్‌ఎస్ నియోజకవర్గం విస్తృస్థాయి సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ను విమర్శించిన వివేక్, వినోద్‌కు తెలంగా ణ ప్రజలు తగిన బుద్ధి ్దచెబుతారని పేర్కొన్నారు. వారికి తెలంగాణ ప్రజల మీదఎలాంటి ప్రేమలేదనీ, ఆస్తులు కాపాడుకునేందుకే రాజకీయాల్లోకి వచ్చారని విమర్శించారు. పార్టీని పటిష్టం చేసుకుని రాను న్న మున్సిపాలిటీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలనీ ఆయన పిలుపునిచ్చారు. సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరా రు. వీరికీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఇన్‌చార్జి అరిగెల నాగేశ్వర్‌రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో జడ్పీవైస్ చైర్మన్ సత్యనారాయణ, బెల్లంపల్లి ఎంపీపీ గోమా స శ్రీనివాస్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డునారాయణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సిలువేరు నర్సింగం, నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల అధ్యక్షులు, సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...