విద్యారంగ అభివృద్ధికి కృషి


Sat,September 14, 2019 03:24 AM

శ్రీరాంపూర్ : విద్యారంగ అభివృద్ధికి తమ వం తు కృషి చేస్తున్నామని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు కం దాల పాపిరెడ్డి పేర్కొన్నారు. జిల్లా ప్రైవేట్ పాఠశా లల సంఘం సర్వసభ్య సమావేశం శుక్రవారం శ్రీరాంపూర్‌లోని సాందిపాని హైస్కూల్లో ట్రస్మా 4 జిల్లాల కన్వీనర్ ఎస్ రాజారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షు డు రాజేంద్రపాణి, జిల్లా కోకన్వీనర్ యెక్కటి రాం రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావే శానికి హాజ రైన ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు పాపిరెడ్డి మాట్లాడారు. స్వరాష్ట్రంలో అక్షరాస్యత పెంచడంతో పాటు విద్యా రంగం అభివృద్ధి చెందాలనే తపనతోనే ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి ప్రైవేటు విద్యా సంస్థలు సహకార మం దిస్తున్నామని చెప్పారు. స్వరాష్ట్రంలో 32 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లోనే చదువుతున్నారని చెప్పారు. వేలాది మంది ఉపా ధ్యాయులకు, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు ఉపాధి కల్పిస్తు న్నామ ని చెప్పారు. ప్రభుత్వం చేయూతనందించాలని కోరారు.

ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు అనంతరెడ్డి మాట్లాడుతూ 3 నుంచి 10తరగతుల విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో ఒలంపియాడ్ టెస్ట్‌లు నిర్వహించి లక్షలాది రూపాయల బహుమతులు అందిస్తున్నామని చెప్పారు. పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నామని చెప్పారు. అనంతరం రాష్ట్ర స్థాయి టాలెం ట్ పోటీల కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నూతన జిల్లా కమిటీ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ప్రభాకర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, రాంచంద్రారెడ్డి, నస్పూర్ మండల అధ్యక్షుడు విష్ణువర్దన్‌రె డ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, కోశాధికారి ఊట్ల సత్యనారాయణ, కరస్పాండెంట్లు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...