నేడే తొలి జడ్పీ భేటీ


Sun,August 25, 2019 10:59 PM

-ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం
-హాజరుకానున్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మంచిర్యాల జిల్లా పరిషత్(జడ్పీ) సర్వసభ్య సమావేశం సోమవారం ఉదయం 11గంటలకు నిర్వహించనున్నారు. తొలి సమావేశం జిల్లా పరిషత్ భవనంలో నిర్వహిస్తున్నట్లు జడ్పీ సీఈవో నరేందర్ ఉత్తర్వులు జారీ చే శారు. ఉదయం పదకొండు గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. జిల్లాకు సంబంధించి దేవాదా య, అటవీ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ పురా ణం సతీశ్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, నడిపెల్లి ది వాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, రేఖా నాయక్, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు హాజరు అవుతారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి పథకాలు, అభివృద్ధి పనుల గురించి చర్చించనున్నారు. శాఖలవారీగా వి వరాలను ఇప్పటికే జడ్పీ సీఈవో అధికారులకు అందించారు.

ఏడు శాఖల స్థాయీ సంఘాల ఎంపిక
జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, ఎంపీపీలు, కో-ఆప్షన్ సభ్యులతో వివిధ శాఖల పనితీరుపై స్థాయి సం ఘాల కమిటీలను సోమవారం ఎంపిక చేయనున్నా రు. దీనికి సంబంధించి ప్రాథమికంగా ఒక రూపు వ చ్చినప్పటికీ సోమవారం నిర్వహించనున్న సమావేశంలో ఆమోదం తీసుకుని ఆయా సంఘాల ఎన్నిక ప్రకటించనున్నారు. ఆర్థిక, ప్రణాళిక, గ్రామీణాభివృ ద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం, పనుల నిర్వహణ అంశాలపై క మిటీలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా పరిషత్ భ వనంలోనే వీటి నిర్వహణ జరగనుంది. మంచిర్యాల పాత ఎంపీడీవో కార్యాలయాన్ని జడ్పీ భవనంగా మార్చారు. అందులోనే జడ్పీ సమావేశం నిర్వహిం చనున్నారు.

గళం వినిపించేందుకు సభ్యులు సిద్ధం
జిల్లాలో 16 జడ్పీ స్థానాలకు 14 టీఆర్‌ఎస్ పార్టీ గెలుచుకుంది. ఎంపీపీ స్థానాలు కూడా అదే స్థాయి లో గెలచుకుంది. ఇందులో గెలుపొందిన వారు అంతా కూడా దాదాపు కొత్తవారే కావడంతో తమ వాణి వినిపించేందుకు సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా తమ ప్రాంతంలోని సమస్యలు వినిపించాలని ఉత్సాహంగా ఉన్నారు. మంచిర్యాల జిల్లా ఎప్పటి నుంచో అనధికార జిల్లా కేంద్రంగా ఉండేది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలన సులభతరం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. గతంలో జడ్పీ సమావేశం వెళ్లాలంటే నేతలకు ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. జిల్లా కేంద్రం దగ్గరలోనే ఉండటంతో సభ్యులు హాజరు శాతం పెరిగి ప్రజా సమస్యలు చర్చించి పరిష్కారానికి నోచుకుంటాయని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...