మొక్కలను దత్తత తీసుకోవాలి


Sun,August 25, 2019 10:56 PM

జన్నారం : ప్రతి విద్యార్థీ ఒక మొక్కను దత్తత తీసుకొని సంరక్షించాలని జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, ఎంపీపీ మా దాడి సరోజన సూచించారు. మండలంలోని తపాల్‌పూర్ గ్రామంలోని హాస్టల్ ఆవరణలో ఆదివారం హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్ మాట్లాడారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని హాస్టల్ వార్డెన్‌కు సూచించారు. మళ్లీ 15 రోజులకు వచ్చి నాటిన మొక్కలన్నింటినీ పరిరక్షిస్తామని తెలిపారు. అనంతరం హాస్టల్‌ను తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాలు పెడుతున్నారా..? రుచికరంగా ఉన్నాయా..? అని తిని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిరుపతి, టీఆర్‌ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు విజయధర్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎస్ సుశీల గ్రామకమిటీ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్ వార్డెన్ పాల్గొన్నారు.

సీసీసీ నస్పూర్ : నాటిన ప్రతి మొక్కనూ రక్షించినప్పుడే హరితహారం లక్ష్యం నెరవేరుతుందని నస్పూర్ మున్సిపల్ కమిషనర్ రాధాకిషన్ పేర్కొన్నారు. నస్పూర్ మున్సిపాలిటీలో ఆదివారం హరితహారం చేపట్టారు. సుందరయ్యకాలనీ సమీప వారసంతలో మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ శ్రీపతి బాపు, అసిస్టెంట్ గోవింద్, బిల్ కలెక్టర్లు పెద్దింటి మోహన్‌రావు, సురేశ్‌కుమార్, తేలేటి నారాయణ, పెద్దపల్లి గోపాల్, సంపత్, తదితరులున్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...