టీఆర్‌ఎస్ బలోపేతానికి కృషి చేయాలి


Sun,August 25, 2019 10:55 PM

దండేపల్లి : గ్రామ స్థాయి నుంచి టీఆర్‌ఎస్ బలోపేతం కోసం ప్రతి కార్యకర్తా ఐక్యంగా పని చేయాలని ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని మేదరిపేట, కొర్విచెల్మ, చింతపెల్లి, ద్వారక, కొత్తమామిడిపెల్లి, పాత మామిడిపెల్లి గ్రామాలో కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశారు. ఎన్నికైన గ్రామ కమిటీ అధ్యక్షుడు పార్టీ అభివృద్ధికి సైనికుల్లా పనిచేయాలన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. సోషల్ మీడియల్ యువత ఆక్టివ్‌గా ఉండి ప్రభుత్వ అభివృద్ధి పథకాలు కల్యాణలక్ష్మీ, రైతుబంధు, రైతుబీమా, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, ఆసరా పింఛన్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కేసీఆర్ కిట్ లాంటి పథకాలను ప్రజలకు తెలుపాలన్నారు.

మేదరిపేట గ్రామ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మిల్కూరి భీమయ్య, గంధె శ్రీనివాస్, కొత్తమామిడిపెల్లి గ్రామ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా చుంచు మల్లేశ్, నలిమెల బుచ్చన్న, ద్వారక గ్రామ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కొత్త తిరుపతి, మునిమడుగుల సత్యనారాయణ, కొర్విచెల్మ గ్రామ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కారుకూరి మల్లేశ్, కారుకూరి తిరుపతి, చింతపెల్లి గ్రామ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా అక్కల రాజు, ఆకుల రమేశ్, చింతపెల్లి యూత్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులుగా లింగాల వెంకటేశ్, అక్కల కుమార్, మేదరిపేట యూత్ అధ్యక్ష, కార్యదర్శులుగా చొప్పదండి వెంకటేశ్, రాపెల్లి జీవన్, కొత్తమామిడిపెల్లి యూత్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పనాస కల్యాణ్, ధనిశెట్టి శ్రీధర్, పాత మామిడిపెల్లి యూత్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పలాజీ శ్రీధర్, శేర్ల వినోద్, కొర్విచెల్మ యూత్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మోటపల్కుల కమలాకర్, రవికుమార్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి రేని శ్రీనివాస్, వైస్ ఎంపీపీ అనిల్‌కుమార్, మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్, టీఆర్‌ఎస్ నాయకులు ముత్తె రాజన్న, పిట్టల అశోక్, చొప్పదండి రమేశ్, తదితరులున్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...