క్రమశిక్షణ రాహిత్యం వల్లే వాచర్ల తొలగింపు


Sun,August 25, 2019 10:55 PM

జన్నారం : క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తించిన 46మంది బేస్ క్యాంప్ సిబ్బంది(వాచర్లు)ను తొలగించామని జన్నారం డివిజన్ అధికారి మాధవరావు పేర్కొన్నారు. ఆదివారం డివిజన్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి సంవత్సం బేస్ క్యాంపు సిబ్బందికి వాకింగ్ టెస్ట్ నిర్వహిస్తారనీ, అందులో ఆరోగ్యంగా ఉన్నా రా లేదా.. అని తెలుసుకుంటారని తెలిపారు. ఆగ స్టు 20న వాచర్లకు వాకింగ్ టెస్ట్ నిర్వహించాల్సి ఉండగా, దాన్ని బహిష్కరించి ఆందోళన చేసిన వారిని తొలగించామని చెప్పారు. ఎనీమల్ ట్రాకర్‌గా పనిచేస్తున్న వాచర్లను తొలగించలేదనీ, కానీ తొలగిస్తారేమో అనే అపోహతో తొలగించిన బేస్ క్యాంపు సిబ్బందితో కలిసి ఎనీమల్ ట్రాకర్ వాచర్లు అందోళనలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. జన్నారం, తాళ్లపేట్ రేంజ్ ఆఫీసర్లు వెంకటేశ్వర్‌రావు, దేవిదాస్ పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...