విద్యాభివృద్ధికి కృషి చేయాలి


Sun,August 25, 2019 10:55 PM

కాగజ్‌నగర్ టౌన్: నియోజకవర్గంలోని ఉపాధ్యా యులు విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. పట్టణంలోని పద్మశాలి సేవా సంఘం భవనంలో పీఆర్టీయూ టీఎస్ కుమ్రం భీం జిల్లా సర్వ సభ్య సమావేశాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ కా ర్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ని యోజకవర్గంలో విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలనీ, తనవంతుగా సహాయసహకారాలు అందజే స్తానన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కరుణాకర్‌రావు మాట్లాడుతూ ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. అంతకు ముందు స్పోకెన్ ఇంగ్లిష్ పుస్తకాలను ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వారికి అం దజేసి సన్మానించారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...