జేఎల్‌కు మం రైతులు అధైర్య పడద్దు


Sun,August 25, 2019 10:54 PM

కౌటాల: వర్షాలతో పంటలు నీట మునిగిన రైతులు ఎవరు అదైర్య పడవద్దని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండల కేంద్రంలోని ఆయన నివాసంలో పలు వురు రైతులతో ఆదివారం ఆయన మాట్లాడారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కొన్ని లో తట్టు పొలాలు నీట మునిగాయనీ, రైతులందరినీ అన్ని విధాల ఆదుకుంటామని ఆయన హామీనిచ్చారు.. పంట నష్ణంపై సంబంధిత అధికారులతో సర్వే చేయించి రైతులకు ప్రభుత్వం తరుపున న్యాయం జరిగేలా చూస్తానని పేర్కొన్నారు. ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్, కో ఆప్షన్ మెంబర్ అజ్మత్ అలీ, ఐటీడీఏ డైరెక్టర్ కొమురం మాంతయ్య, మొగడ్ ధగడ్ ఎంపీటీసీ మనీష్, ఉపసర్పంచ్ తిరుపతి, నాయకు లు గుర్రం శ్రీధర్, రవీందర్ గౌడ్, వెంకన్న, సంతోష్, శ్రీనివాస్, మధుకర్, బ్రహ్మయ్య, రాంచందర్, వెంకటేశ్, మల్లేశ్ పాల్గొన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...