సీఎంఆర్ 100 శాతం సీఎంఆర్ 100 శాతం


Sun,August 25, 2019 01:28 AM

-రబీలో 31 శాతం మాత్రమే పూర్తి
-జిల్లాలో సాగైన ధాన్యం జిల్లాకే..

మంచిర్యాల అగ్రికల్చర్ : కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్‌కు ఇస్తే 67 శాతం మాత్రమే పీడీఎస్ బియ్యం వస్తా యి. ప్రతీ నెలా జిల్లాలోని 423 రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు, సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యానికి ఏడాదికి ఎంత అవసరం పడుతుంద నే లెక్కను పౌర సరఫరాల శాఖ సేకరిస్తోంది. ఇందుకోసం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం సేకరించి 33 శాతం(ఊక, తవు డు) తరుగులు పోగా 67 శాతం కింద బియ్యం సేకరించి అందజేస్తున్నారు. ఇందులో భాగంగానే రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం రైస్ మిల్లులకు కేటాయించి అక్కడ మరాడించి బియ్యాన్ని తిరిగి సివిల్ సప్లయ్‌కి అందజేస్తారు.

ఖరీఫ్‌లో 100 శాతం సీఎంఆర్
ఖరీఫ్‌లో పౌర సరఫరాల శాఖ(సివిల్ సప్లయ్) ఐకేపీ(48 కేంద్రాల), పీఏసీఎస్(52 కేంద్రాలు), డీసీఎంఎస్(28 కేంద్రాలు), మెప్మా(రెండు కేంద్రాల) వంటి 130 కొనుగోలు కేంద్రాల ద్వా రా 18,803.120 మెట్రిక్ టన్నుల గ్రేడ్ ఏ, 48,241.240 మెట్రిక్ టన్నుల సాధారణ రకం ధాన్యం మొత్తం 67,044.360 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. మిల్లర్లు 36,736.547 మెట్రిక్ టన్నుల బియ్యం సివిల్ సప్లయ్ కార్పొరేషన్(సీఎస్‌సీ)కి అందజేయాల్సి ఉంటుంది. కాగా, రా రైస్ (ముడిబియ్యం) 67 శాతంకు 31,617. 330 మెట్రిక్ టన్నులు, బాయిల్డ్ రైస్(ఉప్పుడు బియ్యం) 68 శాతం చొప్పున 5,041.110 మెట్రిక్ టన్నులు అందించారు. ఈ లెక్కన 36,658.440 మెట్రిక్ టన్నుల (99.79శాతం) సీఎంఆర్ మిల్లర్లు ఇచ్చారు.

రబీలో 31 శాతం సీఎంఆర్
జిల్లాలో రబీలో గతంలో ఎన్నడూ లేని విధం గా రికార్డు స్థాయిలో 1,56,586.120 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. జిల్లాలోని నాలుగు ఏజెన్సీల ద్వారా 177 ధాన్యం కొనుగోలు కేంద్రాలలో డీఆర్‌డీఏ ఐకేపీకి చెందిన 63, మెప్మాకు చెందిన 2 కేంద్రాలతోపాటు పీఏసీఎస్ 81, డీసీఎంఎస్ 31 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించారు. డీఆర్‌డీఏ ఐకేపీ 63 కేంద్రాల ద్వారా 52,423.840 మెట్రిక్ టన్నుల ధాన్యం 9,592 మంది రైతుల వద్ద, మెప్మా రెండు కేంద్రాల ద్వారా 1580.560 మెట్రిక్ టన్నుల ధాన్యం 307 మంది రైతుల వద్ద, పీఏసీఎస్ 81 కేంద్రాల ద్వారా 53,235.760 మెట్రిక్ టన్నుల ధాన్యం 9,530 మంది రైతుల వద్ద, డీసీఎంఎస్ 31 కొనుగోలు కేంద్రాల ద్వారా 49,345. 960 మెట్రిక్ టన్నుల ధాన్యం 7,696 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. 1,56, 586.120 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 27,125 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఎఫ్‌సీఐకి బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) 68 శాతం చొప్పున 57,936.150 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ఇవ్వాల్సి ఉండగా ఈ నెల 22వ తేదీ వరకు 18,163.781 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ మిల్లర్లు ఇచ్చారు. అంటే 31.35 శాతం పూర్తి చేశారు. ఇంకా 39.772.369 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంది.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...