ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి


Sun,August 25, 2019 01:25 AM

వాంకిడి: నీటి నిల్వలను పెంచుకోవడానికి ప్రతి ఇంట్లో ఒక ఇంకుడు గుంత నిర్మిం చుకోవాలని జడ్పీటీసీ అజయ్‌కుమార్ సూచిం చారు. మండలంలోని పిప్పర్‌గోంది, సావాతి, భాదా, ఖిర్డి, జైత్‌పూర్, సోనాపూర్, తదితర పంచాయతీ కార్యాల యాల్లో శనివారం వేర్వేరు గా జలశక్తి గ్రామసభలు నిర్వహించారు. పిప్పర్ గోందిలో నిర్వహించిన గ్రామసభలో జడ్పీటీసీ పాల్గొని మాట్లాడారు. జలశక్తి అభియాన్ ద్వా రా చెరువులు, కుంటల్లో పూడిక తీయాలనీ, బోరుబావుల వద్ద ఇంకుడుగుంతలు నిర్మిం చాలని సూచించారు. అనంతరం గ్రామసభలో పలు అభివృద్ధి పనుల నిర్వహణకు తీర్మానం చేశా రు. పిప్పర్‌గింది సర్పంచ్ నీలాబాయి, చౌప న్‌గూడ ఎంపీటీసీ ఆత్రం రాంబాయి, సావాతి సర్పంచ్ దేవ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...