మిల్లుల్లో సివిల్ సప్లయ్ సిబ్బంది తనిఖీలు


Sun,August 25, 2019 01:25 AM

మంచిర్యాల అగ్రికల్చర్ : జిల్లాలోని రైస్ మిల్లులను జిల్లా పౌర సరపరాల శాఖ అధికారి (డీసీఎస్‌ఓ) వై వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు శని వారం సివిల్ సైప్లె శాఖ సిబ్బంది తనిఖీలు చేశారు. మిల్లుకు కేటాయించిన ధాన్యం ఎంత, ఇప్పటి వరకు ఎంత ధాన్యం బా యిల్డ్ అయ్యిందో పరిశీలించారు. సీఎంఆర్ లక్ష్యం ఎంత, ఇప్పటి వరకు ఎఫ్‌సీఐకి మిల్లుల వారిగా ఇచ్చిన సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ఎంత అన్నది అడిగి తెలుసుకున్నారు. సీఎంఆర్‌ను వేగవంతం చేయాలని, గడువులోగా లక్ష్యం పూర్తి చేయాలని మిల్లర్లను కోరారు. రిజిష్టార్‌లను, స్టాకును పరిశీలించారు. మంచిర్యాల సమీప ఏసీసీలోని హనుమాన్ ఆగ్రోస్, అందుగులపేటలోని శ్రీ వాసవి, శ్రీ వెంకటేశ్వర, అంబిక సాయి రైస్‌మిల్లును తనిఖీ చేశారు. ఈ తనిఖీలో సివిల్ సైప్లె శాఖ సిబ్బంది రాజశేఖర్, వెంకటేష్, మిల్లర్లు తదితరులున్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...