మండపాల్లో సీసీ కెమెరాలు అమర్చాలి


Sun,August 25, 2019 01:25 AM

మంచిర్యాలటౌన్, నమస్తే తెలంగాణ: గణేష్ మండళ్ల నిర్వాహకులు విధిగా నిబంధనలు పాటించాలని మంచిర్యాల పట్టణ సీఐ తిరుపతిరెడ్డి సూచించారు. పట్టణంలో గణేష్ మండపాల నిర్వాహకులతో శనివారం ఆయన సమావేశమై మాట్లాడారు. గణేష్ మండపాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిమజ్జనం అనంతరం ఆ కెమెరాలను వాడల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అధిక శబ్దంతో వినిపించే మైకులు, సౌండ్ బాక్సులు పెట్టవద్దని, విద్యుత్ తీగలను కొత్త వాటిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిమజ్జనం సందర్భంగా డీజే సౌం డ్స్ పెట్టవద్దని, వాటికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాతం వాతావరణం లో పండుగలు జరుపుకోవాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రోడ్లపై మండపాలు ఏర్పాటు చేయవద్దని, ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎస్సై ఓంకార్ యాదవ్, ఆయా మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...