శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు


Sun,August 25, 2019 01:24 AM

మంచిర్యాలటౌన్, నమస్తే తెలంగాణ: శాంతి భధ్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని రామగుండం డీసీపీ (అడ్మిన్) అశోక్ కుమార్ హెచ్చరించారు. మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లోబీజేపీ, టీఆర్‌ఎస్ నాయకులకు శనివారం ఆయన కౌన్సెలింగ్ ఇచ్చారు. పట్టణంలో ఆయా పార్టీల నాయకుల మధ్య ఆరోపణలు తీవ్ర స్థాయికి చేరి బహిరంగ చర్చకు దారి తీశాయి. పదిరోజులుగా పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ ఆరోపణ లు చేసుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో సంఘ విద్రోహ శక్తులు శాంతి విఘాతానికి పాల్పడే ప్రమాదం ఉంటుందని ఇరు పార్టీల నాయకులు సూచించారు.

ఈ ప్రాంత అభివృద్ధి, సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలే గానీ ప్రజలను ఇబ్బందులకు గురిచేసేవిధంగా వ్యవహరించవద్దని సూచించారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఇరు పార్టీలకు చెందిన పలువురు నాయకులను బైండోవర్ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీసీ (లా అండ్ ఆర్డర్ ) రవి కుమార్, మంచిర్యాల ఏసీపీ గౌస్‌బాబా, పట్టణ సీఐ తిరుపతిరెడ్డి, ఎస్సైలు మారుతి, ఓంకార్‌యాదవ్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...