శ్రీకృష్ణాష్టమి వేడుకలు


Sun,August 25, 2019 01:24 AM

శ్రీరాంపూర్: శ్రీమద్భగవద్గీత సత్సంగ్ వెల్‌ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్‌కే 8 గీతా మందిర్‌లో శ్రీ క్రిష్ణాష్టమి వేడుకలు శనివారం ఘనం గా కొనసాగాయి. సొసైటీ అధ్యక్షుడు దాసరి రా జేశం ఆధ్వర్యంలో ఆలయంలో భక్తులు శ్రీ కృ ష్ణుడికి 108 రకాల ప్రసాదాలు సమర్పించారు. అభిషేకాలు నిర్వహించారు. లక్ష పుష్పార్చణ, 11 అధ్యాయాలు గీతా పారాయణ నిర్వహించారు. భక్తులు అకండ భజన, కోలాటాలతో నృత్యాలు చేశారు. గీతా ప్రభోదకులు జేపీ విఠ ల్ కృష్ణావతారం గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భక్తి మార్గంలో వెళ్లే వారి అభిష్టాలు నెరవేరుతాయన్నారు.

సేవా భావంతో ఇతరులకు సాయం చేయాలని కోరారు. శ్రీమద్భగవద్గీత సత్సంగ్ వెల్ఫేర్ సొసై టీ కార్యదర్శి డీడీ ప్రసాద్, ఉపాధ్యక్షుడు మల్లే శం, రామబాబు, బుచ్చయ్య, రాజమౌళి, సార య్య, సభ్యులు మనోహర్, లక్షారెడ్డి ఉన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...