షీటీమ్స్.. ఓ భరోసా


Sat,August 24, 2019 12:02 AM

-పోకిరీల ఆటకట్టిస్తున్న ప్రత్యేక బృందాలు
-కళాశాలల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు
-ఇప్పటివరకు 1833 మంది ఆకతాయిలకు కౌన్సెలింగ్
-11 మందిపై కేసులు నమోదు
-డయల్ 100కు పెరుగుతున్న ఫిర్యాదులు
-క్షణాల్లో స్పందిస్తున్న పోలీసులు

మంచిర్యాల టౌన్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం పోలీస్ శాఖలో ఏర్పాటుచేసిన షీటీమ్స్ మహిళలకు రక్షణ కవచంలా నిలుస్తున్నాయి. ఈ ప్రత్యేక బృందాలు వారిలో భరో సా, ఆత్మైస్థెర్యం నింపుతున్నాయి. షీటీమ్స్ పనితీరుపై జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహన కల్పిస్తుండడం ఫిర్యాదుచేసేందుకు యువతులు, మహిళలు ముందుకొస్తున్నారు. మహిళలను వేధించే వ్యక్తులు, ఆకతాయిలు, పోకిరీలు షీటీమ్‌ల ఏర్పాటు తర్వాత తోకముడవాల్సిన పరిస్థితి తలెత్తింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 అక్టోబర్ 24న షీటీమ్‌లను ఏర్పాటుచేశారు. రాష్ట్ర రాజధానిలో తొలుత అమలుచేయగా సత్ఫలితాలు రావడంతో అన్ని జిల్లాలకు విస్తరించారు. 2015 అక్టోబర్ 31న ఉమ్మడి ఆదిలాబాద్‌లో షీటీములను ఏర్పాటుచేశారు. ఆ సమయంలో 23 షీటీమ్ బృందాలను ఏర్పాటుచేసి ఉమ్మడి జిల్లాలోని అన్ని పట్టణాలు, మండలకేంద్రాల్లో వాటి కార్యకలాపాలను ప్రారంభించాయి. మహిళలపై దాడి గానీ, వేధింపులకు సంబంధించిన డయల్ 100కు ఫిర్యాదు రాగానే వెంటనే స్పం దించి సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని సరైన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. మంచిర్యాల జిల్లా ఏర్పాటైన తర్వాత రామగుండం పోలీస్ క మిషనరేట్ పరిధిలోకి వెళ్లింది. అప్పటినుంచి ప్ర స్తుతం మంచిర్యాల డీసీపీగా ఉన్న రక్షిత కె మూర్తి గోదావరిఖని ఏసీపీగా కమిషనరేట్ పరిధిలో షీటీ మ్ బాధ్యతలు నిర్వర్తించారు. అన్ని మండలాలు, పట్టణాలు, కళాశాలలు, పాఠశాలల్లో సదస్సులు నిర్వహించి అవగాహన కల్పించారు.

తద్వారా వారిలో ఆత్మైస్థెర్యం నింపడమే గాక షీటీమ్స్ పనితీరు, ఫిర్యాదు చేసే విధానం, ఎలాంటి సమయా ల్లో షీటీములను ఆశ్రయించాలి, దీని వల్ల కలిగే ప్రయోజనాలు, సరైన రీతిలో స్పందించకపోతే కలిగే నష్టాలను వారు మహిళలకు, విద్యార్థినులకు వివరించారు. షీటీం బృందంలోని పోలీసులు సామాన్య మనుషుల మాదిరి సివిల్ డ్రెస్సుల్లో ఉంటూ రద్దీ ప్రాంతాల్లో , కళాశాలలు ఉన్న ప్రదేశాల్లో జనంతో కలిసిపోయి అక్కడ మహిళలను, అమ్మాయిలను ఎవరైనా వేధిస్తున్నారా అన్న విషయాన్ని గమనిస్తారు. వారి వద్ద కెమెరాల్లో పోకిరీలు, ఆకతాయిలు చేసే పనులను చిత్రీకరిస్తారు. ఆధారాలతో సహా నిందితులను పట్టుకుని స్టేషన్‌కు తరలిస్తారు. ఆ తర్వాత వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తారు. అక్కడి నుంచి పం పించిన తర్వాత వారిపై ప్రత్యేక నిఘా పెడతారు. వారి ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చిందా లేదా అన్న విషయాన్ని పరిశీలిస్తారు. మార్పు వచ్చినట్లు వారికి నమ్మకం కలిగేదాకా వారిపై నిఘా ఉంచుతారు. మార్పురాకపోతే కేసు నమోదు చేస్తారు.

కమిషనరేట్ పరిధిలో 11 కేసులు
రామగుండ కమిషనరేట్ పరిధిలో 2017 నుంచి ఇప్పటివరకు మహిళలను వేధించిన ఘటనల్లో మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా 19,561 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 1,833 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 2017లో 3,334 అ వగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 961 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. రెండు కేసులు నమోదు చేశారు. 2018 లో మంచిర్యాల జిల్లాలో 5420 అవగాహన సదస్సులు నిర్వహించారు. 124 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. మూడు కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు కమిషనరేట్ పరిధిలో 72 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 144 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. నాలుగు కేసులు నమోదు చేశారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...