నా ఓటు యాప్ ద్వారా వివరాలు


Fri,August 23, 2019 11:59 PM

మంచిర్యాల రూరల్ : ఓటర్లు తమ వివరాలను నా ఓటు యాప్ ద్వారా తెలుసుకోవచ్చని కలెక్టర్ భారతి హోళికేరి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ బాంబర్‌లో జేసీ వై సురేందర్‌రావు, ట్రైనీ కలెక్టర్ దీపక్ కుమార్‌తో కలిసి పోస్ట ర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తేదీ డిసెంటర్ 31, 2001లోపు పుడితే ఓటరుగా తమ పేరు నమోదు చేసుకొని ఓటరు గుర్తింపు కార్డు పొందవచ్చని తెలిపారు. వివరాల కోసం www.nvsp.in, www. ceotelangana.nic.in వెబ్‌సెట్‌లలో, నా ఓటు యాప్‌లో చూడవచ్చనని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనదని పేర్కొన్నారు. నూతనంగా ఓటరు నమోదు, గుర్తిం పు కార్డు కలిగి ఉండి జాబితాలో పేరు లేకున్నా ఏమైనా మార్పులు, చేర్పులు, చనిపోయిన వారి తొలగింపులు, చిరునామా మార్పు ఇతరాత్ర వివరాలు ఆన్‌లైన్ ద్వారా చేసుకోవచ్చని చెప్పారు. సూచనల కోసం బూత్ స్థాయి అధికారి, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, మీసేవ కేంద్రం, కామన్ సర్వీస్ సెంటర్‌లో సంప్రదించవచ్చనీ, వివరాల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయవచ్చని తెలిపారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శా ఖ అధికారి శ్యామలాదేవి, ముఖ్య ప్రణాళికాధికారి సత్యనారాయణరెడ్డి, డీపీఆర్‌ఓ సంపత్ కుమార్, ఎన్నికల అధికారి మల్లయ్య, సూపరింటెండెంట్ శ్రీనివాస్ అధికారులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...