మంచి ఫలితాలు సాధించాలి


Fri,August 23, 2019 11:58 PM

సీసీసీ నస్పూర్ : విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాధికారి పాణిని సూచించారు. శుక్రవారం ఆయన నస్పూర్ జడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఉదయం పాఠశాలకు వచ్చిన డీఈఓ విద్యార్థులతో కలిసి ప్రార్థనలో పాల్గొని పలు సూచనలు చేశారు. విద్యార్థులు ఉన్నతంగా ఆలోచించి ఎలాంటి అనుమానాలు లేకుండా పాఠాలు నేర్చుకొని ఉన్నత చదువు కొనసాగించాలని కోరారు. పదో తరగతి విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానలు తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం అయ్యారు. జిల్లాలో 45శాతం మంది విద్యార్ధులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారనీ, ఈ సంఖ్యను పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల్లో బోధించేందుకు ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులను సంప్రదించి వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రఘుపతిరెడ్డి, రవి, కమల, ప్రేమ, జయపాల్, తదితరులు ఉన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...