పచ్చని చెట్లతోనే ప్రగతికి మెట్లు


Fri,August 23, 2019 11:58 PM

సీసీసీ నస్పూర్ : పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని శ్రీరాంపూర్ జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం సీసీసీ నస్పూర్ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందితో కలిసి కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి సీఎం డీ ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామనీ, ఇందులో భాగంగా శ్రీరాంపూర్‌లో 10లక్షల మొక్కలు నాటడానికి ఆగస్టు నెలను హరిత మసోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ నెల మొత్తం నిర్విరామంగా మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు.

శ్రీరాంపూర్ ఏరియాలో ఇప్పటి వరకు రెండు పర్యాయాలు రికార్డు స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. దేశం లో ఎక్కడ లేని విధంగా సింగరేణి నర్సరీలో వివి ధ రకాల జతుల మొక్కలు అందుబాటులో ఉం చామన్నారు. ప్రతి విద్యార్ధి మొక్కలు నాటి సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్ధులకు వివరించారు. ఈ కార్యక్రమం లో కళాశాల కరస్పాండెంట్, డీజీఎం పర్సనల్ గోవిందరాజు, పర్యావరణ అధికారి అమరేందర్‌రెడ్డి, పిన్సిపాల్ సుధాకర్‌రావు, పర్సనల్ మేనేజర్ అజ్మీరా తుకారాం, అన్ని విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...