స్వగ్రామానికి చేరుకున్న వలసజీవి మృతదేహం


Fri,August 23, 2019 11:58 PM

దండేపల్లి : దండేపల్లి మండలం గుడిరేవు గ్రామానికి చెందిన నాంపెల్లి రాజు(24) సౌదీలో గత నెల 21న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శుక్రవారం ఉదయం 3 గంటలకు మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మృతదేహం చేరుకున్నది. గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సౌదీ శాఖ, రియాద్ కోఆర్డినేటర్ల సహకారంతో ఉదయం ఇంటికి చేర్చారు. సౌదీలో జన్నారం మండలం రోటిగూడ చెందిన మిత్రుడు శ్రీనుతో కలిసి తన రూమ్ నుంచి 10 కిలోమీటర్లు దూరంలో గల దుకాణానికి ద్విచక్ర వాహనంపై కబూస్(రొట్టెలు)తీసుకుందామని వెళ్తుండగా వెను క నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే.

మృతదేహాన్ని సొంతూరికి తీసుకొచ్చేందుకు సాయం అందించాలని ప్రభుత్వాన్ని కుటుంబీకులు అభ్యర్థించగా అధికారులు, ప్రజానిధులు స్పందించడంతో మృతదే హం ఇంటికి చేరుకుంది. నిరుపేద కుటుంబం కావడంతో ఉపాధి కోసం సౌదీ వెళ్లిన కొడుకు మృత్యువాత పడడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహాన్ని చూడగానే ఒక్కసారిగా కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని సొంతూరికి రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత అంబులెన్స్ సమకూర్చిందని తెలంగాణ ఎన్నారై విభాగం సభ్యులు తెలిపారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...