60 రోజుల ప్రణాళికకు సిద్ధ మవ్వాలి


Fri,August 23, 2019 11:57 PM

మంచిర్యాల రూరల్: గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత, మొక్కలు నాటేందు కు 60 రోజుల ప్రణాళికపై జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య పంచాయ తీ విస్తరణ అధికారుల(ఈఓపీఆర్డీ)లతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. డీపీఓ మాట్లాడుతూ ఇటీవల సీఎం చంద్రశేఖర్ రావు కలెక్టర్లతో జరిగిన సమావేశంలో గ్రామాల్లో పరిశుభ్రత, పారిశుధ్యం, మొ క్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలని పాలనాధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కలెక్టర్ ఆదేశాలతో 60 రోజుల్లో చేయాల్సిన పనులపై సమీక్ష నిర్వహించారు. గ్రామ వికాసంలో పంచాయితీ రాజ్‌ది కీలక పాత్ర అన్నారు.

ఇందులో భాగంగా గ్రామ పంచాయతీల్లో ఎవరి విధులు ఎలా ఉంటాయి, నిధులు ఎలా సమకూర్చుకోవాలో పంచాయతీ రాజ్ చట్టంలో రూపొందించారన్నారు. గ్రామా ల్లో పారిశుధ్య పనులు నిర్వహించాలనీ, గ్రామాల పరిధిలోని పాఠశాలలు, వైద్య శాలలు, అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థల్లో పారిశుధ్య పనులను నిర్వహించడం గ్రామ పంచాయతీ ల బాధ్యతన్నారు. గ్రామాల్లో కూలి పో యిన ఇండ్లు, పాడైపోయిన పశువుల కొ ట్టాల శిబిరాలను తొలగించాలన్నారు. ఉపయోగించని, పాడుబడ్డ బావులు, నీ టి కుంటలను పూర్తిగా పూడ్చి వెయాలనీ ఇందుకు నరేగా నిధులను వినియోగించుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాల నీ, గ్రామాలలో శ్మశాన వాటికలు, డం పింగ్ యార్డుల నిర్మాణాలకు స్థలాలను ఎంపిక చేయాలని అదేశించారు. గ్రామానికి కావాల్సిన పంచవర్ష ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు. స మావేశంలో పంచాయతీ విస్తరణఅధికారులు సప్దర్ అలీ, అజ్మత్ అలీ, శంకర్, మేఘమాల తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...