పంచాయతీల్లో డిజిటల్ కీ


Fri,August 23, 2019 02:07 AM

-నిధుల వినియోగానికి సరికొత్త విధానం
-ఇక ఆన్‌లైన్‌లోనే బిల్లుల చెల్లింపులకు సర్కారు శ్రీకారం

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఈ గవర్నెన్స్‌లో భాగంగా గ్రామ పంచాయతీల్లో సరికొత్త విధానానికి ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. పంచాయతీల్లో పాత చెక్కుల విధానాలకు స్వస్థి పలికి, డిజిటల్ కీ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇంతకాలం పంచాయతీల్లో నిధుల విడుదల చెక్కుల రూపంలో ఉండే ది. ఇలా రాత చెక్కుల విధానంతో, నిధులు దుర్వినియోగమవుతున్నాయని గుర్తించిన సర్కారు, దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. పంచాయతీల్లో పారదర్శకంగా నిధులను ఖర్చు చేసే వి ధంగా సర్పంచ్‌తోపాటు ఉప సర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్‌ను ఇచ్చింది. వీరిరువురి సంతకాలతో కూ డిన డిజిటల్ కీని తీసుకొచ్చి, ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోనికి తెచ్చింది.

పాత విధానానికి స్వస్తి
గ్రామ పంచాయతీలో ఇంత వరకు నిధులు ఖర్చుకోసం రాత చెక్కు విధానం అమలులో ఉండేది. గామాభివృద్ధికి అవసరమైన నిధులను పంచాయతీ సర్పంచ్, కార్యదర్శి సంతకం చేసి రశీదును ట్రెజరీ కార్యాలయానికి తీసుకెళ్లేవారు. ఇలా తీసుకెళ్లిన చెక్కులను సరి చూసుకున్న తరువాత ట్రెజరీ నుంచి బ్యాంకు ద్వారా నగదు విడుదలయ్యేది. అయితే పాత విధానంలో పారదర్శకత లోపించి అక్రమాలకు ఆస్కారం ఉండేది. కొన్ని పంచాయతీల్లో నిధులను సక్రమంగా వినియోగించలేకపోవడం, పనులు చేయకుండానే నిధులు ఖర్చుచేస్తున్నారనే ఆరోపణలు వస్తుండేవి. ఇకపై నిధులు దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం ఆన్‌లైన్ చెక్కుల విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రజల సంక్షేమం కోసం కేటాయిస్తున్న నిధులు పూర్తిగా పారదర్శకంగా వినియోగం కావాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. పల్లెల అభివృద్ధిలో కీలక భూమిక పోషించే పంచాయతీల పాలనలో అనేక సంస్కరణలు చేపట్టింది. సర్పంచ్‌తోపాటు ఉపసర్పంచ్‌కు జాయింట్ చెక్‌పవర్ కల్పించింది. ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా పనులు పూర్తయి, అభివృద్ధి పథంలో నిలపాలని తీసుకుంటున్న ఈ చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.

ఇప్పటికే ప్రారంభమైన సంతకాల సేకరణ
జిల్లాలోని పంచాయతీల్లో డిజిటల్ కీ కోసం సర్పంచులు, ఉప సర్పంచుల సంతకాలను మండలస్థాయిలో ఈఓపీఆర్డీలు సేకరిస్తున్నారు. అక్కడి నుంచి ఎస్టీకి పంపించనున్నారు. గ్రామాల్లో చేపట్టిన పనుల వివరాలను ఈ పంచాయతీ సాఫ్ట్‌వేర్‌లో గ్రామ కార్యదర్శులు తొలుత నమోదు చేయాల్సి ఉంటుంది. అన్ని సక్రమంగా నమోదు చేసి, సబ్‌మిట్ చేస్తేనే సంబంధిత పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్‌ల సంతకాలతో కూడిన డిజిటల్ కీ చెక్ బయటకు వచ్చి, వారి సెల్‌ఫోన్ నంబర్లకు ఓటీపీ వెళ్తుంది. డిజిటల్ చెక్ వెనుకాల సర్పంచ్, ఉప సర్పంచుల రాత సంతకాలు చేసి ఓటీపీ నంబర్‌తో పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఎస్టీఓకు పంపించాలి. ఈ ప్రక్రియ పూర్తయితేనే పంచాయతీలకు బిల్లులు చెల్లుబాటు అవుతాయి.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...