మహిళలు స్వయం ఉపాధి


Fri,August 23, 2019 02:03 AM

దండేపల్లి : మహిళలు స్వయం ఉపాధితో, తమ కాళ్లపై తాము నిలబడినప్పుడే సాధికారత సాధ్యమవుతుందని జిల్లా డిప్యూటీ కలెక్టర్, మైనార్టీ వెల్ఫేర్ అధికారి ఏ శ్యామలదేవి పేర్కొన్నారు. దండేపల్లి మండల కేంద్రంలో గురువారం వెలుగు ఫౌండేషన్ సౌజన్యంతో ఆదర్శ వయోజన విద్యా కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మగ్గం వర్క్ శిక్షణ కేంద్రాన్ని పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంకల్పంతో ముందు కెళ్లాలనీ, ఏదైనా సాధించాలనే పట్టుదలతో ఉండాలని సూచించారు. మగ్గం వర్క్‌ను మహిళలు, యువతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వృత్తిలో నైపుణ్యతను పెంపొందించుకొని అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు.గ్రామీణ నిరుపేద మహిళలు ఆర్థిక అభివృద్ది దిశగా పయనించేందుకు మగ్గం శిక్షణ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. మహిళలు చదువుతో పాటు ఇతర అంశాల్లో నైపుణ్యం పెంచుకోవాలన్నారు. బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత గ్రామాలుగా మార్చడంలో మహిళలు ముందుండాలని సూ చించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములై మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ రీజినల్ డైరెక్టర్ అత్తి సరోజ, మాజీ ఎంపీపీ గోళ్ల మంజుల, జిల్లా వయోజన విద్యా శాఖ అధికారి పురుషోత్తం నాయక్, వెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు రాంప్రకాశ్, మహిళా అధ్యక్షురాలు అరుణ, డీఆర్‌పీ కొండు జనార్ధన్, శిక్షకురాలు ఉమాదేవి, తదితరులు పాల్గొన్నారు.41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...