వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి


Fri,August 23, 2019 02:02 AM

కౌటాల : పదోతరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అభివృద్ధి అధికారి సత్యనారాయణ రెడ్డి సూ చించారు. మండల కేంద్రంలోని బీసీ వసతి గృహాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. వసతి గృహంలోని సమస్యల గురించి విద్యార్థులు ఆయనకు తెలిపారు. మరుగుదొడ్లు మంచిగాలేవని చెప్పారు. వర్షానికి భవనం ఊరవడంతో సామగ్రి, పుస్తకాలు తడిసిపోతున్నాయని తెలిపారు. ఇందుకు ఆయన స్పందిస్తూ.. వసతి గృహంలో సమస్యలు లేకుండా చూస్తామని హా మీ ఇచ్చారు. అలాగే పదో తరగతి విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించాలనీ, వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనీ, వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వార్డెన్ జయశంకర్‌కు సూచించారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...