26న జడ్పీ సమావేశం


Fri,August 23, 2019 02:02 AM

మంచిర్యాల రూరల్: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం 26వ తేదీ నిర్వహించనున్నామనీ, అందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వాహణ అధికారి కాకరా ల నరేందర్ గురువారం తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు సమావేశం ఉంటుందనీ, ఇందులో మొత్తం 42 అంశాలపై చర్చ ఉంటుందన్నారు. జిల్లా ఏర్పాటు అనంతరం ఒక జడ్పీ సభ్యులిని ఎన్ను కుని ఆమె ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం ఇదే మొ దటిసారన్నారు. గతంలో ఆదిలాబాద్‌లో నిర్వ హించే జిల్లా పరిషత్ సమావేశానికి అధికారులు, జడ్పీటీసీలు హాజరుకావాలంటే సమారు 300 కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చేది. మం చిర్యాల జిల్లా కేంద్రం కావడంతో జిల్లా పరిషత్ కార్యాలయం ఏర్పాటైంది. దీంతో అధికారులు, పరిషత్ సభ్యులకు దూరా భారం తగ్గింది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్యడంతో అధిక శాతం మహిళా జిల్లా పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

ప్రభుత్వంలో పంచాయతీ రాజ్ శాఖతో పాటు సంబంధిత శాఖల్లో జిల్లా పరిషత్ కీలకంగా ఉండడంతో శాఖ ల వారీగా పలు అంశాలపై చర్చించి, తీర్మానాలు చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన పాలన, ప్రభుత్వ పథకాలను అందించేందుకు దోహదపడుతుంది. గ్రామ సచివాలయాలతో పాటు జిల్లా పరిషత్ ముఖ్య భూమిక పోషిస్తుంది. ముందస్తుగా సంబంధిత శాఖల అధికారులు సమావేశానికి తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకొని హాజ రు కానున్నారు. సమావేశంలో కలెక్టర్ భారతి హోళి కేరి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరు కానున్నారు.

ఎనిమిది మంది మహిళలే
మంచిర్యాల జిల్లా పరిషత్‌లో మహిళలకు తెలంగాణ ప్రభుత్వం సగం స్థానాలను మహిళల కు కేటాయించి మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. జిల్లా కేంద్రంలో మొత్తం 16 జడ్పీటీసీ లు ఉండగా ఇందులో 8 మంది మహిళా జడ్పీటీ సీలే ఉన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...