వన్యప్రాణులకు సరిపడా ఆహారం అందించాలి


Fri,August 23, 2019 02:01 AM

జన్నారం: కవ్వాల్ అభయారణ్యంలోని వన్య ప్రాణులకు సరిపడా ఆహారం అందించేందుకు గ్రాస్ ప్లాంటేషన్‌ను విరివిగా పెంచాలని మంచిర్యాల డీఎఫ్‌వో శివాని డోగ్రా అన్నారు. డివిజన్‌లోని చింతగూడ బీట్‌ల్లో పెంచుతున్న గ్రాస్ ప్లాం టేషన్‌ను గురువారం ఆమె పరిశీలించారు. అడవుల్లోని నేల నమునాను బట్టి అప్రాంతంలో ఎలాంటి గడ్డిపెరుగుతుందో గుర్తించి పెంచాలన్నారు. వన్యప్రాణులకు కావలసిన ఆహారం ఎక్కడైతే ఎక్కువగా దొరుకుతుందో అక్కడకు వన్యప్రాణులు అధికంగ వస్తాయన్నారు. గడ్డిపెంపకంపైన ప్రతి బిట్ అధికారి ప్రత్యేక శ్రద్ధ వహించేలా చూ డాలన్నారు. డివిజన్‌లోని అన్ని రేంజ్‌ల్లో గల బీట్లన్నింటిలో గడ్డిని విరివిగా పెంచి వన్యప్రాణులకు అందించేలా చూడాలన్నారు. అమె వెంట జన్నా రం ఎఫ్‌డీవో మాదవరావు, రేంజ్ అపీసర్ వెంకటేశ్వర్‌రావు, డిఅర్‌వో ప్రకాష్ ఉన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...