గూడెం ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవం


Fri,August 23, 2019 02:01 AM

దండేపల్లి: మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో పవిత్రోత్సవాలు గురువారంతో ముగిసాయి. చివరి రోజున ఆలయంలో మూలమంత్ర సహిత, హయగ్రీవ హో మం, పంచవిశంతి శతకలశ అభిషేకం, మహా పూర్ణాహుతి, కుంభప్రోక్షణం హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని అలంకరించారు. మూడు రోజుల పాటు ఆలయంలో వైభవంగా కార్యక్రమాలను నిర్వహించారు. దేవస్థాన ముఖ్య అర్చకులు రఘుస్వామి, సంపత్‌స్వామి, యాగ్నికులు అభిరామాచార్యులు, సహాయ అర్చకులు శ్రీధర్ స్వామి పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...