పచ్చదనం, పరిశుభ్రతకు 60 రోజుల ప్రణాళిక


Fri,August 23, 2019 02:01 AM

మంచిర్యాల రూరల్: జిల్లాలో పచ్చదనం, పరిశుభ్రత, మొక్కలను నాటేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో 60 రోజు ల కార్యాచరణ ప్ర ణాళికను రూపొందించాలని కలెక్టర్ భారతి హోళికేరి ఆదేశించారు. కలెక్టర్ ఛాంబర్‌లో ట్రెయినీ కలెక్టర్ కు మార్ దీపక్‌తో కలసి జిల్లాలోని మండలాభివృద్ధి అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో మొక్కలు నాటి పరిరక్షిస్తే వర్షాలు కురుస్తాయనీ, దీంతో జీవ వైద్యద్యానికి దోహదం చేస్తుందన్నారు. పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడ డం ప్రభుత్వ లక్ష్యమని అవినీతికి అస్కారం లే కుండా రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందు లు లేకుండా ప్రతి గ్రామంలో ఒక బోర్డును ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లో మొక్కలు నాటడం, రోడ్లు, పాఠశాలలు, వీధి దీపా లు, డంపింగ్ యార్డులు, నర్సరీలతో పాటు పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పా ల్గొనేలా ప్రజలను చైతన్య పర్చాలన్నారు.

గ్రామాల్లో ట్రాక్టర్, ట్రాలీ ఏర్పాటు చేసి అవని ప్లాం టేషన్ ద్వారా ప్రతి గ్రామాని కి 1200 మొక్కల ను నాటే లక్ష్యాన్ని 100 శాతం పూర్తి చేయాల న్నారు.ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిం చాలన్నారు. గ్రామస్తులతో స ర్పంచ్ ప్రతి నెల గ్రామసభ ఏర్పా టు చేసి సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించాలన్నారు. సభలో ఆమోదం పొందిన తర్వాత పనులను ప్రారంభించాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో కోఆప్షన్ సభ్యులు ఉండాల నీ, గ్రామాల్లో ఎన్‌ఆర్‌జీ నిధులను వినియోగిస్తూ నాటిన మొక్కలకు రక్షణ కవచాలను ఏర్పాటు చేసి పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, మండలాభివృద్ధి అధికారులతో పాటు సంబంధిత శాఖల అధికారులున్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...