రాష్ట్రస్థాయి క్యారమ్స్ పోటీల్లో ప్రతిభ


Thu,August 22, 2019 12:58 AM

బెల్లంపల్లి టౌన్ : హైదరాబాద్‌లో ఈనెల 17 నుంచి 20 వరకు జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి క్యారమ్ ర్యాంకింగ్ టోర్నీ లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చూపి, బహుమ తులు సాధించారు. అండ ర్-21 బాలుర విభాగంలో సాయిచరణ్ (బెల్లంపల్లి) ప్రథమ, బీ రమేష్ (గోలేటి) ద్వితీయ, ఎండీ. నిమాల్ అహ్మద్ (బెల్లంపల్లి) నాలు గో స్థానంలో నిలిచా రు. అండర్-14 విభాగంలో ఎండీ ముఖీస్ అహ్మద్ (బెల్లంపల్లి) తృతీయ స్థానం సాధించాడు. విజేతలకు షీల్డులతో పాటుగా నగదు బహుమతి, సర్టిఫికెట్లను అందజేశారు. విజేతలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా క్యారమ్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం జగన్నాథం, కార్యదర్శి రాచకట్ల బాలరాజు, ప్రచార కార్యదర్శి తనుగుల రాజన్న అభినందించారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...