హరితహారంలో భాగస్వాములు కావాలి


Thu,August 22, 2019 12:58 AM

దండేపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహరం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ విజయ రామారావు అన్నారు. మండలంలోని గూడెం ఆలయంలో జిల్లాలోని ఆలయాల ఈవో లు, మేనేజర్లు, మండల ఇన్‌చార్జిలతో స మావేశం నిర్వహించారు. అనంతరం సత్యనారాయణ స్వామి ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. రెండు జిల్లాల పరిధిలోని ప్రతి దేవస్థానంలో మొక్కలు విరివిగా నాటి, వాటిని సంరక్షించే బాధ్యత సిబ్బంది తీసుకోవాలన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దేవాలయాల్లో 22670 మొక్క లు నాటేందుకు లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 6200 మొక్కలు నాటామన్నారు. దేవాలయ భూములను సంరక్షించాలని, జిల్లాలోని ధూపదీప నైవేద్యం పథకం కింద దేవాలయాల్లో పని వేళలతో, వేతన వివరాలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.అనంతరం మండలంలోని దూపదీప పథకంలోని దేవాలయాలను ఆయన సందర్శించారు. కార్యక్రమంలో ఆయా దేవాలయాల ఈవోలు నారాయణ, రవి, వామన్‌రావు, వెంకన్న, బాపిరెడ్డి, మండల ఇంచార్జ్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...