భూ సమస్యలు పరిష్కరించుకోవాలి


Thu,August 22, 2019 12:58 AM

దండేపల్లి : రెవెన్యూ సదస్సులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని భూసమస్యలను పరిష్కరించుకోవాలని తాసిల్దార్ కిరణ్మయి అన్నారు. మండలంలోని రెబ్బెన్‌పెల్లి గ్రామంలో బుధవారం భూసమస్యల పరిష్కార వేదికలో రెవెన్యూ అధికారులు రైతుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడారు. గ్రామాలలో నిర్వహించే రెవెన్యూ సదస్సులకు పూర్తి స్థాయి అధికారులు హాజరు అవుతారని చెప్పారు. భూ సమస్యలు ఉన్న రైతులు అర్జీలు పెట్టుకోవాలని, పరిష్కరించుకోవడానికి వీలున్న సమస్యలను ఇక్కడే పరిష్కరిస్తామన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు, ఆన్‌లైన్‌లో నమోదు, విరాసత్ తదితర భూ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు హాజరవుతారని అన్నారు. మిస్సింగ్ సర్వే నంబర్లు, కాస్తులో ఉన్నా ఆన్‌లైన్‌లకు ఎక్కకపోవడం, భూ విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు, విరాసత్‌కు సంబంధించిన సమస్యలను కూడా పరిశీలిస్తామన్నారు. కార్యక్రమంలో డీటీ వాసంతి, ఆర్‌ఐలు అన్నపూర్ణ, గణపతి,వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...