వృద్ధులు అధైర్యపడవద్దు


Thu,August 22, 2019 12:57 AM

మంచిర్యాల లీగల్ : వృద్ధులకు ఎలాంటి అన్యాయం జరిగినా సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్‌ను సంప్రదిస్తే న్యాయం జరుగుతుందని, అధైర్యపడవద్దని సీనియర్ సివిల్ జడ్జీ శ్రీలేఖ, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జీ బీ రమేష్ స్పష్టం చేశారు. ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం సీనియర్ సివిల్ కోర్టు హాలులో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో వారు మాట్లాడారు. వృద్ధులను తమ పిల్లలు పోషించకపోయినా, నేరుగా లోక్ అదాలత్‌లో రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకుంటే కొడుకుల నుంచి నెలనెలా భృతి ఇప్పిస్తామన్నారు. కార్యక్రమంలో బార్ ప్రధాన కార్యదర్శి బండవరం జగన్, ఉపాధ్యక్షులు రాములు, స్పోర్ట్స్ సెక్రటరీ శరత్‌బాబు, న్యాయవాదులు రవీందర్, శైలజ, మంజుల, గంగయ్య, లచ్చన్న, సురేందర్ ఉపాధ్యాయ తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...