24, 25న జిల్లా స్థాయిహ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్


Thu,August 22, 2019 12:57 AM

మంచిర్యాల స్పోర్ట్స్: ఆగస్ట్ 24, 25 తేదీల్లో ఉమ్మడి జిల్లాలోని పాఠశాలల స్థాయి లీగ్ ఛాం పియన్ షిప్ పోటీలను మంచిర్యాలలోని జడ్పీ బాలుర పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్నట్లు హ్యాండ్‌బాల్ సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేశ్, కోశాధికారి రమేశ్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 27 బాలుర జట్లు, 18 బాలికల జట్లు తమ జట్ల వివరాలను పంపించాయని తెలిపారు. ఇందులో మొదటి స్థానంలో నిలిచిన జట్టు కు రూ. 3వేల నగదు, రెండో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 2వేల నగదుతో పాటు జ్ఞాపికలు అందజేయనున్నాయని తెలిపారు. లీగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు 24 ఉదయం 10 గంటలకు ప్రా రంభమవుతాయని తెలిపారు. సమావేశంలో జాయింట్ సెక్రెటరీ శ్రీధర్ పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...