స్టడీ సర్కిళ్లను సద్వినియోగం చేసుకోవాలి


Tue,July 23, 2019 01:08 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: నిరుద్యోగ యువత స్టడీ సర్కిళ్లను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సూచించారు. సోమవారం కలెక్టర్ తన చాంబర్‌లో బీసీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ తీసుకుని ఎస్‌ఐ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసి ఉద్యోగాలు సాధించేందుకు శిక్షణ అందిస్తున్నదని చెప్పారు. స్టడీ సర్కిళ్లలో సీటు పొందిన అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా చదువుతూ పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలన్నారు. మంకమ్మతోటలోని బీసీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ పొందిన ఐదుగురు అభ్యర్థులు పోలీస్‌శాఖ ఇటీవల వెలువరించిన ఫలితాల్లో ఎస్‌ఐ ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు. బీసీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ తీసుకున్న 18 మందిలో సిరిసిల్ల బీవైనగర్‌కు చెందిన గోష్కె నవీన్‌కుమార్ (సివిల్ ఎస్‌ఐ), కొత్తపేట గ్రామానికి చెందిన పొత్తు సరిత (ఏఆర్ ఎస్‌ఐ), కరీంనగర్ చైతన్యపురికి చెందిన నేదునూరి శ్రీనివాస్ (ఆర్‌ఎస్‌ఐ)గా ఉద్యోగాలు సాధించగా, వీరిని కలెక్టర్ అభినందించారు. అలాగే నమిలిగుండుపల్లికి చెందిన మేకల ప్రణీత్ (ఏఆర్ ఎస్‌ఐ), మారెపల్లికి చెందిన చీపురుశెట్టి జలేందర్ (ఆర్‌ఎస్‌ఐ)లు కూడా ఎస్‌ఐ ఉద్యోగాలు సాధించారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతులు అభివృద్ధి శాఖ అధికారి జే రంగారెడ్డి, సహాయ అధికారి రాజమనోహర్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎం రవికుమార్, అభ్యర్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...