ఓటరు తుది జాబితా విడుదల వాయిదా


Mon,July 15, 2019 01:15 AM

మంచిర్యాల టౌన్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర వ్యాప్తం గా ఎన్నికలు జరగాల్సిన 129 మున్సిపాలిటీలు, మూడు మున్సిపల్‌ కార్పోరేషన్లలో ఆదివారం (14న) విడుద చేయాల్సిన వార్డుల వారిగా ఓటరులిస్టు తుది జాబితాను ఈనెల 16కు వాయిదావేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలీఆ మున్సిపాలిటీలో వార్డుల వారిగా ఫోటో ఓటరు జాబితా సక్రమంగా తయారు చేయకపోవడం, కొ న్నిచోట్ల ఈ ప్రక్రియ పూర్తికాని నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు ఎన్నికల సంఘాన్ని గడువు పెంచాలని కోరారు. ఈ నేపథ్యంలో 14న విడుదల చేయాల్సిన తుదిజాబితాను 16న ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయా లని మున్సిపల్‌ శాఖ ఉన్నతాధికారులనుంచి ము న్సిపల్‌ కమిషనర్లకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు వార్డులవారీగా ఓటరు తుది జాబితాను 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఇక్కడి మున్సిపల్‌ అధికారులు పేర్కొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...