అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌కు ఆదరణ


Mon,July 15, 2019 01:15 AM

-ఎమ్మెల్యే దివాకర్‌రావు
-పార్టీలో చేరిన కాంగ్రెస్‌ నాయకులు
-నియోజకవర్గంలో జోరుగా సభ్యత్వ నమోదు
మంచిర్యాలటౌన్‌, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్‌ హయాం లో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసే ఇతర పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లోకి చేరుతున్నారని ఎమ్మెల్యే దివాకర్‌రావు పేర్కొన్నారు. మంచిర్యాలలోని ఎమ్మెల్యే నివాసంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో లక్షెట్టిపేట పట్టణానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి ఎమ్మెల్యే దివాకర్‌రావు గులాబీ కండువా కప్పి టీఆర్‌ఎస్‌లోకి సాదారంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో లక్షెట్టిపేట మండల బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కొత్త వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నూనె ప్రవీణ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గుండా క్రిష్ణమోహన్‌ ఉన్నారు. వీరంతా వారి అనుచర గణంతో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు నల్మాసు కాంతయ్య, ఐక్య వ్యాపార సం ఘం మండల అధ్యక్షుడు మైలారం సుధాకర్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ చుంచు చిన్న య్య, మాజీ ఎంపీపీ కట్ల చంద్రయ్య, వైస్‌ ఎంపీపీ పాదం శ్రీనివాస్‌, మండల పార్టీ అధ్యక్షుడు పోడేటి శ్రీనివాసగౌడ్‌, మాజీ ఎంపీటీసీలు షాహిద్‌ అలీ, వజ్ర రమేశ్‌, మెట్టు కల్యాణి రాజ్‌, నడిమెట్ల రాజన్న, కిషన్‌, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...