తాళ్లపల్లి భూనిర్వాసితుల సమస్యలు పారిష్కారిస్తాం


Mon,July 15, 2019 01:15 AM

శ్రీరాంపూర్‌ : తాళ్లపల్లి గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం గ్రామంలో మాజీ ఎంపీటీసీ బండారి సుధాకర్‌ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు చేశారు. ఎమ్మెల్యే దివాకర్‌రావు, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్‌ అత్తి సరోజ పాల్గొని నాయకులకు, కార్యకర్తలకు పార్టీ సభ్యత్వం అందించారు. గోదావరికి వెళ్లే రోడ్డు నిర్మిస్తామన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లను గెలిపిస్తే గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. త్వరలోనే మిషన్‌ భగీరథతో తాగునీరు సరఫరా చేస్తానని చెప్పారు. మెడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులతో మంచిర్యాల వరకు గోదావరి నీరు ఉంటుందన్నారు. తాళ్లపల్లి ఓసీపీ భూనిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాసం అందేలా కృషి చేస్తానని చెప్పారు. 68 జీఓ వేతనాలు చెల్లించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు కమలాకర్‌రావు, జక్కు ల రాజేశం, పార్టీ జిల్లా కార్యదర్శి పత్తి గట్టయ్య, ఉపాధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, నాయకులు బొడ్డు చిన్నయ్య, తిరుపతి, రుకుం తిరుమల్‌, మారుపాక మల్లేశం, దగ్గుల మధు, గోపాల్‌, రాజలింగు, రాజమౌళి పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...