నిరుపేదలకు కార్పొరేట్‌ స్థాయి విద్యనందిస్తాం


Mon,July 15, 2019 01:14 AM

సీసీసీ నస్పూర్‌ : నిరుపేదలకు కార్పొరేట్‌ స్థాయి విద్యనందించడానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ఎమ్మె ల్యే దివాకర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన నస్పూర్‌లో నిర్మించిన కస్తూర్భా పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాల నిర్మాణ పనులు పరిశీలించారు. పాఠశాలను ఎప్పటిలోగా సిద్ధం చేస్తారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవనంలో నీటి కొరత ఉండడంతో ఆయన ఇటీవలే బోర్‌వెల్‌ వేయించారు. చిన్న చిన్న పనులు మినహా బిల్డింగ్‌ నిర్మాణం పూర్తయింది. ప్రహరీ నిర్మాణానికి నిధులు సమకూర్చి నిర్మించాల్సి ఉంది. కేజీబీవీ బిల్డింగ్‌ను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కేజీటూ పీజీ ఉచిత విద్యలో భాగంగా సీఎం కేసీఆర్‌ విద్యా వ్యవస్థ పటిష్టానికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి ట్రస్ట్‌ చైర్మన్‌ విజిత్‌రావు, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్‌ అత్తి సరోజ, నాయకులు వంగ తిరుపతి, కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, మల్లెత్తుల రాజేంద్రపాణి, పత్తి గట్టయ్య, తోట శ్రీనివాస్‌, కమలాకర్‌రావు, వేల్పుల రవీందర్‌, హైమద్‌, అక్కూరి సుబ్బ య్య, ముస్త్యాల శ్రీదేవి, దెబ్బటి రామన్న, పానుగంటి సత్తయ్య, ముక్కె ర వెంకటేశ్‌, జక్కుల కుమార్‌, కుర్మిల్ల అన్నపూర్ణ, రౌతు రజిత, బొడ్డు చిన్నయ్య, సయ్యద్‌ ఖాసీం, గుమ్మ డి శ్రీనివాస్‌, కుర్మిళ్ల అన్నపూర్ణ, రౌతు రజిత, తదితరులు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...