నేడు రామకృష్ణాపూర్‌లో ఇళ్ల పట్టాల పంపిణీ


Mon,July 15, 2019 01:14 AM

రామకృష్ణాపూర్‌ : సింగరేణి స్థలాల్లో ఉంటున్న రామకృష్ణాపూర్‌ ప్రజల దశాబ్దాల చిరకాల స్వప్నం నెరవేరనుందనీ, నేడు చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు అందుకోనున్నారనీ టీఆర్‌ఎస్‌ పార్టీ సమన్యయ కర్త అబ్దుల్‌ అజీజ్‌ తెలిపారు. ఆదివారం పట్టణ టీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సింగరేణి స్థలంలో నివాసం ఉంటున్న వారికి పట్టాలిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారని తెలిపారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్‌కు, సింగరేణి సీ అండ్‌ ఎండీ శ్రీధర్‌కు చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ప్రత్యేక చొరవ చూపి వినతి పత్రం అందించారని గుర్తు చేశారు. దీంతో సీఎం స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు సర్వే కూడా నిర్వహించారని పేర్కొన్నారు. ఈ మేరకు అర్హులైన వారికి ఇండ్ల పట్టాల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని రామకృష్ణాపూర్‌లో సోమవారం ఉదయం 11 గంటలకు టోని ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ చేతుల మీదుగా అర్హులకు ఇండ్ల పట్టాల పంపణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు సుదర్శన్‌, బి. నర్సింగరావు, జాడి శ్రీనివాస్‌, చిలువేరు సదానందం, కోల శ్రీనివాస్‌, గంగారపు సత్యపాల్‌, బంగారు వేణు, ఎర్రవెల్లి రాజేశ్‌ తదితరులున్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...