హలో సక్కు గారు..


Sun,July 14, 2019 01:18 AM

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ : సీఎం కార్యాలయం నుంచి శనివారం ఉదయం 10.20 గంటలకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు ఫోన్ వచ్చింది. దానిని లిఫ్ట్ చేయగానే సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హలో సక్కు గారు.. అని పలకరించారు. ఇందుకు సక్కు రాం రాం సార్ అంటూ స్పందించారు. వారిద్దరి మధ్య మూడు నిమిషాల పాటు సంభాషణ జరిగింది..

సీఎం : పార్టీ భవన నిర్మాణానికి పార్టీ నుంచి నిధులుమంజూరు చేయడం జరుగుతుంది
సక్కు : ఓకే సార్
సీఎం : నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి
సక్కు : ఓకే సార్..
సీఎం : పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎలా నడుస్తుంది
సక్కు : బాగా నడుస్తుంది సార్
సీఎం : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పార్టీ సభ్యత్వాల రిపోర్టు తీసుకున్నా. బ్రహ్మండంగా ఉంది.
సక్కు : థాంక్యూ సార్. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు సార్ ప్రారంభించారు. ఇప్పటి వరకు రెండు సార్లు వచ్చారు సార్. ఆన్‌లైన్ సెంటర్‌ను కూడా పరిశీలించారు.
సీఎం : పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు అభినందనలు
సక్కు : థాంక్యూ సార్

- సభ్యత్వంలో మూడో స్థానం..
సీఎం ఫోన్ చేసిన విషయాన్ని ఎమ్మెల్యే ఆత్రం సక్కు నమస్తే తెలంగాణకు తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 26 వేల సభ్యత్వాలను ఆన్‌లైన్ చేశామనీ, ఇంకా 6 వేల సభ్యత్వాలను ఆన్‌లైన్ చేయాల్సి ఉందని వివరించారు. రాష్ట్రంలోనే ఆసిఫాబాద్ నియోజకవర్గం సభ్యత్వ నమోదులో ఇప్పటి వరకు మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...