టీఆర్‌ఎస్‌తోనే శ్రమ జీవులు


Sun,July 14, 2019 01:14 AM

బెల్లంపల్లి, నమస్తే తెలంగాణ: శ్రమజీవుల అండదండలు టీఆర్‌ఎస్‌కే ఉన్నాయనీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. బెల్లంపల్లి చిన్న హమాలీ సంఘం కార్యాలయంలో టీఆర్‌ఎస్ సభ్యత్వం నమోదు నిర్వహించారు. చిన్న హ మాలీలు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ శ్రమజీవులు మొదటినుంచీ గులాబీ పార్టీతోనే ఉన్నారని తెలిపారు. తెలంగాణ సాధించిన తరువాత టీఆర్‌ఎస్ సర్కారు ఆధ్వర్యంలో శ్రమజీవుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. హామాలీల సమస్యలను తీర్చేందుకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాననీ స్పష్టం చేశారు. హామాలీలు గులాబీ పార్టీ అభివృద్ధికి సహకారం అందించాలనీ కోరారు. జిల్లా జడ్పీ చైర్మన్ సత్యనారాయణ, టీఆర్‌ఎస్ శ్రేణులు, చిన్న హమాలీలు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...