కాషాయం.. నిలువెల్లా విషం


Thu,July 11, 2019 03:46 AM

(కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ) సికింద్రాబాద్‌లోని బైసన్‌పోలో మైదానంలో సచివాలయం కట్టాలని ముందుగా తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం వెనక అనేక ప్రజా ప్రయోజనాలున్నాయి. ఇందులో భాగంగానే సచివాలయ నిర్మాణానికి రక్షణ శాఖ పరిధిలోని భూములను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పం పింది. పలుసార్లు కేంద్రం వద్దకు వెళ్లి రక్షణశాఖ భూములు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు భూములు ఇచ్చేందుకు కేంద్రం కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు ముం దుగా వార్తలు కూడా వచ్చాయి. నిజానికి, బైసన్‌పోలో మైదానంలో సచివాలయం నిర్మాణం చేయాలన్న ఆలోచన వెనుక అనేక రకాల ప్రజా ప్రయోజనాలున్నాయి. దశాబ్ద కాలంగా సికింద్రాబాద్‌లోని జేబీఎస్ బస్టాండ్ నుంచి తిరుమలగిరి, అల్వాల్ మీదుగా కరీంనగర్ వచ్చి వెళ్లే ప్రధాన మార్గం రోజురోజుకూ కుంచించుకుపోతోంది. అలాగే, జేబీఎస్ నుంచి తాడ్‌బండ్, బోయినపల్లి మీదుగా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు వచ్చి వెళ్లే మార్గం కూడా ఇదే స్థితిలో ఉంది. హైదరాబాద్ ప్రాంతానికి రా కపోకలు విపరీతంగా పెరిగిన దరిమిలా ఈ రోడ్ల విస్తరణ అనివార్యంగా మారింది. దీనికి కంటోన్మెంట్ పరిధిలోని ఆర్మీ భూములు అడ్డంకిగా మారాయి. కేంద్రం అ నుమతి లేకుండా రక్షణ శాఖ భూముల్లో నిర్మాణాలు చేయడానికి వీలులేదు. వీ ట న్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ భూములను ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర సర్కారు కోరిం ది. రక్షణ శాఖ భూములు అప్పగిస్తే.. రహదారుల విస్తరణతోపాటు రెండు రహదా రులపై రెండు ఎలివేటడ్ ైఫ్లె ఓవర్లు నిర్మాణం చేసే ఆలోచనను కూడా చేసింది. దాని వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాలోని నిజమాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా వాసులే కాదు, సికింద్రాబాద్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని భా వించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.

విషం కక్కిన కమలం..
రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడాల్సిన భారతీయ జనతాపార్టీ విషం కక్కింది. రక్షణ శాఖ భూములు అప్పగించే విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రభు త్వానికి సహకరించాల్సింది పోయి.. అడ్డుపడింది. రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభు త్వానికి ఇవ్వకుండా మేమే అడ్డుకున్నామని నిస్సిగ్గుగా భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు కే లక్ష్మణ్ చెప్పడంపై తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. ప్రస్తుతం సచి వాలయం కూల్చివేత అంశంపై ఇటీవల ఓ చానల్ నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావే శంలో లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన తీరు యావత్ తెలం గాణ ప్రజలను విస్మయానికి గురిచేసింది. బైసన్‌పోలో మైదానంలో సచివాలయం కడుతామని గత అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అ వసరమని కేసీఆర్ చెప్పారు. కానీ, మేం మాత్రం ఆపి తీరుతామని చాలెంజ్ చేశాం. ఆ మేరకు ప్లాన్ (సార్ట్ అవుట్) చేశాం. చివరకు కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ నుంచి సదరు భూములు ఇవ్వకుండా అన్ని ప్రయత్నాలూ చేసి ఆపు చేశాం అంటూ ఆయనే స్వ యంగా రౌండ్‌టేబుల్ సమావేశంలో వెల్లడించారు.

పెరగనున్న ట్రాఫిక్ తిప్పలు..
హైదరాబాద్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ వెళ్లి వచ్చే ప్రయాణి కులకు మున్ముందు ప్రయాణం నరకంగా మారే ప్రమాదమున్నది. రక్షణ శాఖ భూము లు ఇవ్వకుండా బీజేపీ రాష్ట్ర నాయకత్వం అడ్డుపుల్ల వేసిన నేపథ్యంలో.. భవిష్యత్ లోనూ ఈ భూముల అప్పగింతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒకవైపు హైదరాబాద్ లో ట్రాఫిక్ రోజురోజుకూ పెరుగుతుండగా.. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, క రీంనగర్ జిల్లాలకు వచ్చిపోయే సికింద్రాబాద్‌లోని ప్రధాన రహదారి మాత్రం రో జురోజుకూ కుంచించుకుపోతుంది. దీంతో ప్రయాణికులు అవస్థలు పడాల్సి వస్తు న్నది. మున్ముందు ట్రాఫిక్ తిప్పలు మరింత పెరిగే ప్రమాదమున్నది. నిజానికి కరీంన గర్ నుంచి అల్వాల్ వరకు వెళ్లేందుకు ఎంత సమయం పడుతుందో.. అక్కడి నుంచి సికింద్రాబాద్ చేరేందుకూ అంతే సమయం పడుతున్నది. కొన్నిసార్లు అల్వాల్ నుంచి తిరుమలగిరి చౌరస్తా మీదుగా సికింద్రాబాద్ చేరుకునేందుకు రెండు, మూడు గంటల సమయం అవుతున్నది. ఈ సమస్యను అధిగమించాలంటే రోడ్ల విస్తరణ జరగాలి. అలాగే, ఎలివేటడ్‌ై ఫ్లెఓవర్లు నిర్మాణం కావాలి. ఇవి సాధ్యపడాలంటే రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలి. అంతర్జాతీయ నగరంగా హైదాబాద్ దినదినం పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా రోడ్ల విస్తరణ జరగాల్సిన అవసరమున్నది. వీటన్నింటినీ పక్కన పెట్టి కేవలం రాజకీయ దురుద్దేశ్యంతో కేంద్ర డిఫెన్స్ శాఖ నుంచి భూములు రాకుండా బీజేపీ అడ్డుకోవడంపై తెలంగాణవాదుల నుంచే కాదు.. ఆయా జిల్లాల ప్రజలనుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

భూములిస్తేనే ట్రాఫిక్ సమస్యకు చెక్..
ప్రస్తుతం సచివాలయం ఇతర ప్రాతంలో నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణ యించిన విషయం తెలిసిందే. ఇందుకోసం పనులు సాగుతున్నాయి. ఇక్కడ కూడా ప్రతిపక్షాలతో కలిసి బీజేపీ అడ్డుకుంటోంది. అయితే, ఈ విషయాన్ని కొద్ది సేపు పక్కన పెడితే.. ప్రజా ప్రయోజనాల కోసమే తాము పనిచేస్తున్నామని చెప్పే రాష్ట్ర భారతీయ జనతాపార్టీ, చిత్తశుద్ధి ఉంటే ఆ దిశగా అడుగులు వేయాలన్న డిమాండ్ తెలంగా ణవాదుల నుంచి వస్తున్నది. బైసన్‌పోలోలో సచివాలయం నిర్మాణం కాకుండా ఉండేందుకు రక్షణ శాఖ భూములు ఇవ్వకుండా అడ్డుకున్నామని చెబుతున్న బీజేపీ ముందు పలు ప్రశ్నలు ప్రజల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. సచివాలయాన్ని వేరే ప్రాంతంలో నిర్మాణం చేయాలని ఇప్పటికే తెలంగాణ ప్ర భుత్వం నిర్ణయించినా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో మాత్రం ట్రాఫిక్ సమ స్యను అధిగమించేందుకు రక్షణ శాఖ భూములు అవసరమని నిపుణులు చెబు తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు, అలాగే రోడ్ల విస్తర ణకు, ఎలివేటెడ్ ైఫ్లెఓవర్ల నిర్మా ణానికి కావాల్సిన భూములను రక్షణశాఖ నుంచి ఇ ప్పించే బాధ్యతను రాష్ట్ర కమళద ళం తీసుకోవాలన్న డిమాంగ్ గట్టిగా వినిపిస్తున్నది. దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ట్రాఫిక్ ఇబ్బందులు, రోజురోజుకూ పెరుగుతున్న రద్దీ సమస్యకు చెక్ పెట్టాలంటే రహదారుల విస్తరణ ద్వారానే సాధ్యమనీ, ఈ విస్తరణ కావాలంటే రక్షణశాఖ భూములిస్తేనే సాధ్యం అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. నిజంగా ప్ర జాప్రయోజనాల కోసం పనిచేసే ఉద్దేశం బీజేపీకి ఉంటే కేంద్రాన్ని ఒప్పించి రక్షణ శాఖ నుంచి ఈ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిం చాలన్న డిమాండ్ వస్తోంది. అంతేకాదు, ప్రస్తుతం ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి ఆ పార్టీకి సంబంధించి ముగ్గురు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎంపీలు కూడా హైదాబాద్ వెళ్లి వచ్చినప్పుడు ఈ ట్రాఫిక్ సమస్యను ప్రత్యక్షంగా ఎ దుర్కొంటున్నారు. కళ్లెదుట ఉన్న సమస్యను పరిష్కరించే అంశంపై దృష్టిపెట్టి కేంద్రాన్ని ఒప్పిస్తారా? లేక ప్రజల ఇక్కట్లు పట్టకుండా వ్యవహరిస్తారా? అన్న విషయం ముందు ముందు తేలనున్నది.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...