సోషల్ సైన్యం


Thu,July 11, 2019 03:41 AM

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం సంక్షేమం, అభివృ ద్ధిని రెండు కండ్లుగా భావించి పాలన సాగిస్తున్నది. మొదటి టర్మ్‌లో దాదాపు 426 పథకాలు ప్రవేశ పెట్టి దేశంలోనే పేరుపొందింది. ఆసరా పింఛన్ల పెంపు, రైతుబంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్, సబ్సిడీపై పరికరాలు, రుణాల మంజూ రు, విద్యార్థులకు కిట్స్, కేసీఆర్ కిట్ వంటి అద్భు త పథకాలు ప్రవేశపెట్టింది. మరోవైపు కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో రైతుల కలలు నెరవేరుస్తు న్నది. దీనితో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నా యి. మరోవైపు రైతులకు ఎన్నో రకాలుగా ఉప యోగపడేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుం టోంది. వీటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేం దుకు సోషల్ మీడియా విభాగాన్ని పటిష్ఠం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం సోషల్ సైన్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

బాల్క సుమన్ ఆధ్వర్యంలో ప్రణాళికలు
ప్రభుత్వ పథకాల ప్రచారం, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవడంతోపాటు పార్టీకి, ప్రజలకు మధ్య కార్యకర్తలు వారధులుగా ఉండే లా ఈ సోషల్ మీడియా సైన్యానికి ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా చెన్నూర్ నియోజకవర్గ వ్యాప్తంగా 500 మంది యువత ను ఎంపిక చేసి బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శిక్షణ ఇచ్చారు. సోషల్ మీడియాలో కీలకంగా ఎలా వ్యవహ రిం చాలి? ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఎలా చేరవేయాలి? వారికి అర్థమయ్యేలా సోషల్ మీడియాను ఎలా ఉపయోగించుకోవాలి? అనే అంశాలపై శిక్షణ ఇచ్చారు. అదే సమ యంలో పార్టీపైన, ప్రభుత్వ పథకాలపైన దుష్ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టేలా ఆ శిక్షణలో వివరించా రు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శంబీపూ ర్ రాజు, శ్రీనివాస్ రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గట్టు రాంచందర్‌రావు, తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి, టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ పాల్గొన్నారు.

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు
- సోషల్ మీడియా వర్క్‌షాపులో ఎమ్మెల్యే బాల్క సుమన్
ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా ఒక బలమైన సామాజిక మాధ్యమంగా మారిందని చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియాను ఉపయోగించి ప్రభుత్వ పథకాలు విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ప్రభు త్వం ప్రవేశపెడుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా చూడాలన్నారు. కేసీఆర్ అధికారం లోకి వచ్చిన తరువాత దేశంలోనే ఏ ప్రభుత్వం చేయని విధంగా కార్యక్రమాలు చేస్తుందని పేర్కొన్నారు. ఇవన్నీ ప్రజలకు వేగంగా తెలి యాలంటే సోషల్ మీడియానే సరైన మార్గమని తెలిపారు. ప్రభుత్వ పథకాల ప్రచారంతోపాటు ప్రతిపక్షాలు చేస్తున్న అనవసరమైన ఆరోపణలు ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని కార్యకర్తలకు సూచించారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...