టీఆర్టీ భర్తీ ప్రక్రియ ప్రారంభం


Thu,July 11, 2019 03:41 AM

ఎదులాపురం: టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ 2017 పోస్టుల భర్తీ ప్రక్రియ జిల్లాలో బు ధవారం ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లా ప్రతిపదికన ఉపాధ్యాయ నియమాక ప్రక్రియను చేపట్టేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 69 స్కూల్ అసిస్టెంట్, 78 భాషా పండిత పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే అభ్యర్థుల జాబితాను జిల్లా విద్యాశాఖ కార్యాలయం వెబ్‌సైట్ లో పొందుపర్చారు. ఉపాధ్యాయ నియామక పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ వెరిఫికేషన్ నిర్వహించి 13, 14 తేదీ ల్లో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

పోస్టుల వివరాలు
ఉమ్మడి జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లు 69, భాషా పండితులు 78 పోస్టులను భర్తీ చే యనున్నారు. మైదాన ప్రాంతంలో 51 స్కూల్ అసిస్టెంట్లు, ఏజెన్సీ ప్రాంతంలో 18 మొత్తం 69, భాషా పండితులు ఏజె న్సీ ప్రాంతంలో 32, మైదాన ప్రాంతంలో 46 మొత్తం 78 పోస్టులను భర్తీ చేసేం దుకు ఏర్పాటు చేస్తున్నారు. వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను కూడా భర్తీ చే యాల్సి ఉన్నప్పటికీ టీఎస్‌పీఎస్సీ నుంచి లిస్టులు రాకపోవడంతో మిగతా పోస్టుల కు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు. మొదట కేటగిరి 4లోని పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు.

నేడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్
టీఆర్‌టీలో ఎంపికైన అభ్యర్థులకు గురువారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు డీఈవో రవీందర్‌రెడ్డి ప్రకటించారు. అభ్యర్థులు మూడు సెట్ల జిరా క్స్ పత్రాలు, ఓర్జినల్ సర్టిఫికెట్లు, 3పాస్‌ఫోటోలతో వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 13న స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు, 14న భా షా పండితులకు కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నారు. కౌన్సెలింగ్ పూర్తయిన వెం టనే 15వ తేదీ ఆయా పాఠశాలల్లో రిపో ర్టు చేయాల్సి ఉంటుంది.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...