టీఆర్‌ఎస్ పార్టీ రాష్ర్టానికి శ్రీరామరక్ష


Mon,July 8, 2019 03:26 AM

కరీంనగర్‌రూరల్: టీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు శ్రీరామరక్షగా భావిస్తున్నారని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు అన్నారు. చింతకుంట గ్రామంలోని వినాయక్‌నగర్‌లో టీఆర్‌ఎస్ నాయకురాలు మాడిశెట్టి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఆయన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అ న్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, బడుగు బ లహీనవర్గాల ప్రజలకు ప్రభుత్వ ఫలాలు నేరుగా అదేవిధంగా సీఎం నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని నగరంలోని 50 డివిజన్లలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ సభ్యత్వం జోరుగా సాగుంతుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభు త్వం చేపడుతున్న పథకాలకు ఆకర్షితులై ప్రజలు పార్టీ సభ్యత్వం కోసం ఉత్సాహంగా ముందుకువస్తున్నారని తెలిపారు. ప్రతి డివిజన్ పరిధిలోని ప్రజలు టీఆర్‌ఎస్ సభ్యత్వం కోసం ఆధార్‌కార్డుల తో రేషన్‌షాపులో బియ్యం సరుకులకు క్యూ కట్టినట్లుగా సభ్యత్వం కోసం కూడా అదే ఉత్సాహంతో ముందు కు వస్తున్నారని వివరించారు. సభ్యత్వ నమోదుకు అన్నివర్గాల నుంచి విశేష స్పం దన లభిస్తోందని ఉద్ఘాటించారు. గ్రామాల్లో టీఆర్‌ఎస్ సభ్యత్వం విజయవంతం చేస్తున్న కా ర్యకర్తలు, ప్రజలకు పార్టీ పక్షన ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు భూక్య తిరుపతినాయక్, వార్డుసభ్యులు శ్రీధర్, సత్యం కోమల, చాంద్‌పాషా, కర్ణకంటి స్వప్న, వినాయకనగర్ అభివృద్ధి కమిటీ నాయకులు పరుశురాం, పద్మ, గంగమ్మ, తిరుపతి, శివరాజు, లింగయ్య, నందయ్య, ఇతర పార్టీ సభ్యులు సైతం సభ్యత్వం తీసుకున్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...