సర్కారు బడికి జై..


Thu,June 20, 2019 02:26 AM

మంచిర్యాల స్పోర్ట్స్ : ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించగా ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసీ సభ్యులు భాగస్వాములై విశేష కృషి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, మౌలిక వసతులు, పదో తరగతిలో వచ్చిన ఫలితాల గురించి పిల్లల తల్లిదండ్రులకు వివరిస్తూ ముందుకుసాగారు. షెడ్యూల్‌ను అనుసరించి కార్యక్రమాలు నిర్వహిస్తూ సర్కారు విద్య ప్రత్యేకలను వివరించడంతో సర్కారు బడుల్లో చేరేందుకు చాలామంది విద్యార్థులు ఆసక్తి చూపారు.

ఇలా సాగింది..
ఈ నెల 14న బడిబాట ప్రారంభం కాగా తొలిరోజు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు పాఠశాలల యాజమాన్యాల కమిటీ బాధ్యులందరితో కలిసి అవాస ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాల గురించి అవగాహన కల్పించారు.
బాలికా విద్యపై అవగాహన
ఈ నెల 15న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు తీసుకొనేందుకు గాను ప్రత్యేకంగా డెస్క్‌ను ఏర్పాటు చేశారు. అవాస ప్రాంతాల్లో బాలికా విద్యపై అవగాహన కల్పించారు. బాలికలకు ప్రభుత్వం అందజేస్తున్న సౌకర్యాలు హెల్త్‌కిట్స్ గురించి ఉపాధ్యాయులు, కేజీబీవీ సిబ్బంది వివరించారు. బాలికలకు విద్య ఎంత అవసరమో వారి తల్లిదండ్రులకు తెలియజేశారు.
సామూహిక అక్షరాభ్యాసాలు..
జూన్ 17న జరిగిన బడిబాట కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అక్షరాభ్యాసం నిర్వహించారు. బడిలో చేరిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులందరు ఏర్పాట్లు చేసుకున్నారు.

పచ్చదనం, పరిశుభ్రతపై అవగాహన
జూన్ 18న పాఠశాలలో స్వచ్ఛభారత్ నిర్వహించి బడిలోని తరగతి గదులను, పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేసుకున్నారు. హరితహారం కార్యక్రమం నిర్వహించి మొక్కలను నాటి గత సంవత్సరం నాటిన మొక్కలను సంరక్షించేందుకు తగు చర్యలు తీసుకున్నారు. మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకువచ్చారు. వాటర్ ట్యాంకులను శుభ్రం చేసుకున్నారు.
చివరి రోజు ఇంటింటా సర్వే..
జూన్ 19న జరిగిన బడిబాటలో పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులతో కలిసి ఉపాధ్యాయులు అవాస ప్రాంతాల్లో ఇంటింటా సర్వే చేశారు. బడి బయట పిల్లలను బడిలో చేర్పించారు. పని కోసం వలస వచ్చిన వారి పిల్లలను గుర్తించి వారిని సమీపంలోని పాఠశాలలో చేర్చారు. మండల టాస్క్‌ఫోర్స్ కమిటీలతో యాజమానుల నుంచి బాల కార్మికులకు విముక్తి కలిగించారు. ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రభుత్వ ఉద్యోగులను పాఠశాలలకు ఆహ్వానించి వారి సేవలను పాఠశాలలకు అందజేయాలని తెలియజేశారు. పదో తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను పాఠశాలల్లో సన్మానించారు.
జిల్లాలోని పాఠశాలలు..
జిల్లాలో ప్రభుత్వ లోకల్ బాడీస్ పాఠశాలలు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 710 ఉండగా 42,483 మంది విద్యార్థులు బడిబాట ప్రారంభానికి ముందు చదువుతున్నారు. బడిబాటలో 18 మండలాల్లో 3101 విద్యార్థులు చేరారు. ఇందులో బాలురు 1427, బాలికలు 1674 మంది ఉన్నారు. గత సంవత్సరం బడిబాటలో 3130 మంది విద్యార్థులు చేరారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువ ఉండడంతో విద్యార్థులు బడిలో చేరేందుకు రావడం లేదని ఎండలు తగ్గాక అడ్మిషన్లు భారీగా పెరుగుతాయని అయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు.

106
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...