స్వచ్ఛ గ్రామాలుగా తీర్చి దిద్దండి


Thu,June 20, 2019 02:25 AM

-బెల్లంపల్లి సబ్‌కలెక్టర్ రాహుల్‌రాజ్
-గడువులోగా మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయండి
-కార్యదర్శులు, ఉపాధి సిబ్బందితో సమీక్ష
బెల్లంపల్లి టౌన్ (భీమిని): భీమిని, కన్నెపల్లి మండలాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను వంద శాతం పూర్తి చేసి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చి దిద్దాలని సబ్‌కలెక్టర్ రాహుల్ రాజ్ పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందిని ఆదేశించారు. భీమిని మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన భీమిని, కన్నెపల్లి మండలాల స్వచ్ఛభారత్ మరుగుదొడ్ల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామం లో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకునేలా గ్రామస్తులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోనే భీమిని, కన్నెపల్లి మండలాలు చివరి స్థానంలో ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛ గ్రా మాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. నెల చివరి వరకు నిర్మించుకోని కుటుంబానికి రేషన్, విద్యుత్, పింఛన్ నిలిపివేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. ఎం పీడీవో కార్యాలయంలో సిబ్బం ది సమయపాలన పాటించకపోవడంపై ఎంపీడీవో జవహర్‌లాల్‌పై సబ్‌కలెక్టర్ మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యం వహి స్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సూపరింటెండెంట్ శంకర్, వైస్ ఎంపీపీ మహేశ్వర్‌గౌడ్, ఏపీవో దుర్గాదాస్, సర్పంచ్‌లు ఎల్లాగౌడ్, సంతో ష్, సునీత, అంజయ్య, లక్ష్మీ,కమలం, ఓం ప్రకాశ్ గుప్తా, కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది ఉన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...