స్వచ్ఛతా పక్వాడలో భాగస్వాములు కావాలి


Thu,June 20, 2019 02:24 AM

- బెల్లంపల్లి ఏరియా జీఎం కొండయ్య
- గోలేటి, శ్రీరాంపూర్‌లో స్వచ్ఛతా పక్వాడ
-పాల్గొన్న అధికారులు, కార్మికులు
రెబ్బెన : సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా పక్వాడ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బెల్లంపల్లి ఏరియా జీఎం కొండయ్య సూచించారు. గోలేటిటౌన్‌షిప్‌లోని సింగరేణి హైస్కూల్, సింగరేణి డిస్పెన్సరీల అవరణలో స్వచ్ఛతా పక్వాడ కార్యక్రమంలో భాగంగా చెత్తచెదారం తొలగించారు, ఏరియా జీఎం కొండయ్య, సేవా అధ్యక్షురాలు లక్ష్మీకుమారి, ఇతర ఉన్నత అధికారులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రత బాధ్యతగా భావించి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. బెల్లంపల్లి ఏరి యా సేవా అధ్యక్షురాలు లక్ష్మీకుమారి, ఏరియా ఇంజినీర్ బస్విరెడ్డి, డీజీఎంలు జే కిరణ్, యోహన, శివరామిరెడ్డి, ఎస్‌ఎస్‌ఓ వరలక్ష్మి, ఫైనాన్స్ అధికారి బొడ భద్రు, డీవైపీఎంలు బీ సుదర్శనం, ఎల్ రామాశాస్త్రి, సేవా సభ్యులు సోల్లు లక్ష్మి, కుందారపు శంకరమ్మ పాల్గొన్నారు.

శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్ ఏరియా స్టోర్, టింబర్ యార్డ్ లో ఇంచార్జి ఎస్‌ఈ రాజేంద్రప్రసాద్, సత్యనారాయణ స్వచ్ఛతా పక్వాడ నిర్వహించారు. టింబర్ యార్డులోని పిచ్చిమొక్కలు తొలగించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఎస్‌ఈ రాజేంద్రప్రసాద్, సత్యనారాయణ, టీబీజీకేఎస్ ఫిట్ కార్యదర్శి ఇసంపెల్లి ప్రభాకర్, నాయకులు రమణారావు, లవన్‌కుమార్ పాల్గొన్నారు. ఆర్కే న్యూటెక్‌పై మేనేజర్ వెంగళరావు, టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి డి నర్స య్య ఆధ్వర్యంలో కార్మికులు గనిపై స్వచ్ఛ తా పక్వాడ్ నిర్వహించారు. ఆర్కే 8గనిపై డీవైజీఎం రఘుకుమార్, మేనేజర్ విజయ్‌కుమార్, టీబీజీకేఎస్ కేంద్ర చర్చల ప్రతి నిధి ఎనుగు రవిందర్‌రెడ్డి, పిట్ కార్యదర్శి పెండ్లి రవిందర్ కార్మికులు గనిపై చెత్తా చెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు.
జైపూర్ : సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ అడ్మినిస్ట్రేటివ్ భవనం ఎదుట ఎస్టీపీపీ ఉద్యోగులందరూ చెత్త, గడ్డిని తొలిగించారు. ఈ సందర్భంగా జీఎం పిచ్చయ్య శాస్త్రి మాట్లాడుతూ 24న ఎస్టీపీపీ, ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. డీజీఎం ఈఅండ్‌ఎం మదన్‌మోహన్, డీజీఎం ఓఅండ్‌ఎం వేణుగోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...