సరిహద్దు జల్లెడ..


Thu,June 20, 2019 02:24 AM

-ప్రాణహిత తీరంలో పోలీసుల తనిఖీలు.. గాలింపు
-ప్రెద్ద ఎత్తున నిఘా పెట్టిన ఖాకీలు
(మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నా రు. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడం, అటు వైపు మావోయిస్టుల కదలికలు ఉండే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా ప్రాణహిత తీరంలో పోలీసులు, ప్రత్యే బలగాలు జల్లెడ పడుతున్నాయి. సరిహద్దు ప్రాం తంతో పాటు గ్రేహౌండ్స్ బలగాలు జల్లెడ పడుతున్నాయి. కొద్ది రోజుల కిందట ములుగు జిల్లాలో మావోయిస్టులు కరపత్రాలు వదలివెళ్లారు. దీంతో వారు ఇటు వైపుగా వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు మావోయిస్టు యాక్షన్ టీంలు సంచరిస్తున్నాయని కూడా పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీం తో వీరు పూర్తి స్థాయిలో అప్రమత్తం అయ్యారు. వేమనపల్లి, కోటపల్లి, చెన్నూర్ ప్రాంతాల్లో పోలీసులు పూర్తి స్థాయిలో అలర్ట్‌గా ఉన్నారు. మారుమూల ప్రాంతాల్లో అడుగడునా తనిఖీలు చేపడుతున్నారు. అటవీ గ్రామాల్లో కూడా పోలీసులు నిరంతరం గస్తీ కాస్తున్నారు. మారుమూల గ్రామాలపై డేగకన్ను వేశారు. పోలీసులు బృందాలుగా విడిపోయి పలు చోట్ల వివిధ దారుల్లో వాహనాలు ఆపి తనిఖీ చేపడుతున్నారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉ న్నతాధికారులు పోలీసుల గాలింపు ముమ్మరం చేశారు. అనుమానం ఉన్న ఏ గ్రామాన్ని పోలీసు లు వదలడం లేదు. కొత్త వ్యక్తుల సంచారం ఏమై నా ఉందా? పాత వారే నివాసం ఉంటున్నా రా? ఇంకా ఎవరైనా వచ్చారా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. అపరిచితులు సంచరిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలతో చెప్తున్నారు. మావోయిస్టుల యాక్షన్ టీం సంచరిస్తే మాజీ మావోయిస్టులు, మాజీ కొరియర్ల ద్వారా సమాచారం అందుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...